India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో రేపు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. తొలుత ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ ప్లాన్ చేయగా తాజాగా పోలీస్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీంతో నిర్మాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతకు తరలిరానున్నారు. మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.
అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని వేణుగోపాల్ నగర్లో ఉండే పుష్పావతి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కుల గణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అన్ని తనిఖీలు పూర్తిచేసి ఈనెల 20న వివరాలను విడుదల చేస్తారన్నారు.
రెవెన్యూ సదస్సులలో సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకుని, అభివృద్ధి బాటలో నడవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మండలం ధర్మాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. రైతులందరూ పరస్పర సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు అందించిందన్నారు. ఎస్వోపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డులో మంగళవారం దొంగ నోట్లు కలకలం రేపాయి. గొర్రెల సంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగేశ్ అనే రైతు వద్ద గొర్రెలు కొనుగోలు చేశాడు. అందుకు రూ.32,000 దొంగ నోట్లు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని మరో వ్యక్తి ద్వారా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులకు జవాబుదారీతనం ఉండాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కోర్టు కేసులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్ అధికారులను నియమించామన్నారు.
అనంతపురంలోని నీలం సంజీవ రెడ్డి మైదానంలో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు 7వ రోజూ (మంగళవారం) కొనసాగాయి. ఉదయమే ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ పీ.జగదీశ్ దగ్గరుండి పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో బాలయ్య ఫ్యాన్స్ సందడి మొదలైంది. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో ఆయా మండల కేంద్రాల్లో ‘డాకు’ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కదిరిలోని సంగం థియేటర్ వద్ద బాలయ్య నిలువెత్తు కౌటౌట్ ఏర్పాటు చేయగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ <<15084871>>ఈవెంట్<<>> అనంతపురంలో జరుగుతుండటంతో జిల్లాలో ‘డాకు’ ఫీవర్ కనిపిస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి నీలకంఠాపురం చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వెళ్లారు. సామాన్య ప్రయాణికుడిలా తన లగేజీని తానే లగేజీ క్యారియర్‌పై పెట్టి బెంగళూరుకు టికెట్ తీసుకోని ప్రయాణించారు. అయనను చూసి బస్సులోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రఘువీరా సింప్లిసిటీకి ఫిదా అయ్యారు.
Sorry, no posts matched your criteria.