India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.
చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.
చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, పీజీ, డీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.
చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.
తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడంతో స్వగ్రామంలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో వారి తల్లితండ్రులు మునెమ్మ, దొరస్వామి రెడ్డి పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Sorry, no posts matched your criteria.