India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ డివిజన్ లోని నిడదవోలు-కడియం సెక్షన్లో నిర్వహణ పనుల కారణంగా తిరుపతి నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైలును ఆగస్టు 10,కాకినాడ టౌన్-తిరుపతి (17250) రైలును ఆగస్టు 11,తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ (22708) ను ఆగస్టు 9వరకు, విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రైలును 10వ తేదీ వరకు రద్దు చేశారు.
గాజు ముక్క ప్రాణం తీసిన ఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. CI నరసింహారావు కథనం మేరకు.. పోలి గ్రామంలోని SCకాలనీకి చెందిన బాలాజీ, భార్య ధనలక్ష్మి(32) మధ్య ఆదివారం చిన్నపాటి వివాదం నెలకొంది. ఈనేపథ్యంలోనే బాలాజీ గడ్డం గీసుకుంటున్న సమయంలో కోపంతో చేతిలోని అద్దాన్ని భార్యపైకి విసిరాడు. దీంతో అద్దం గాజు ముక్క ధనలక్ష్మి గొంతుకు తగిలి తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ(కడా) ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడా ఏర్పాటుతో పాటు దీనికి ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తామన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి తుది ఎన్నికల లెక్కల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలని తిరుపతి డీఆర్ఏ పెంచల కిషోర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులు, వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు తదితరులకు డీఆర్ఏ పలు సూచనలు చేశారు.
అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. సంబంధిత చెక్కును కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. డ్వాక్రా మహిళల ఉదారతను చంద్రబాబు అభినందించారు. అదే సభలో మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్టు తరఫున మరో రూ.కోటి విరాళంగా ఇచ్చారు.
వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రజల్లోకి రాలేదు. ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. తర్వాత జగన్‌తో జరిగిన సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రం హోస్‌కోటలో రామకుప్పం జడ్పీటీసీ సభ్యుడు నితిన్ రెడ్డి వివాహం జరిగింది. పెద్దిరెడ్డితో పాటు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు ZP ఛైర్మన్ శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు.
ఇసుక, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని సెబ్ అధికారులకు తిరుపతి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు సూచించారు. జిల్లా సెబ్ అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు.
కుప్పం సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘కుప్పానికి రూ.100 కోట్లు కావాలని ప్రజలు కోరుతున్నారు. వంద కాదు.. ఎంతైనా ఇస్తా. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తా. రూ.10 కోట్ల చొప్పున కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలకు రూ.40 కోట్లు ఇస్తా. మేజర్ పంచాయతీలకు రూ.2 కోట్లు, మైనర్ పంచాయతీకి రూ.కోటి కేటాయిస్తాం. కుప్పం మున్సిపాల్టీని రోల్ మోడల్‌గా మారుస్తా’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో కొత్తగా 2 మండలాల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కుప్పం నియోజకవర్గంలో మల్లనూరు, రాళ్లబూదగూరును మండలాలు చేయాలని కోరారు. నిన్ననే వీటి మీద ఆదేశాలు ఇచ్చా. ఇక కుప్పంలో 6 మండలాలు, ఓ మున్సిపాల్టీ ఉంటుంది. కుప్పం డిపో బస్సులను కూడా దొంగలించారు. వాటిని వెనక్కి తీసుకొచ్చాం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను కుప్పం డిపోకు ఇస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
కుప్పంలో చంద్రబాబు బహిరంగ సమావేశం ప్రారంభం కాగానే వర్షం మొదలైంది. దీంతో సమావేశం కొనసాగిద్దామా? కాసేపు ఆపుదామా అని సీఎం కోరగా.. కొనసాగించాలని కార్యకర్తలు కోరారు. ‘కుప్పం దేవుళ్లను నేరుగా చూడటానికి ఇక్కడికి వచ్చా. కుప్పంలో నా సామాజికవర్గ ప్రజలు లేరు. 40 ఏళ్లుగా గెలిపిస్తున్న ఈ వెనుకబడ్డ ప్రజలే నా సామాజికవర్గం. మరోసారి కుప్పం బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు అన్నారు.
Sorry, no posts matched your criteria.