Chittoor

News May 31, 2024

చిత్తూరు: ఆత్మ సేవలు లేక ఇబ్బందులు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆత్మ సహకారంతో గ్రామస్థాయిలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేవారు. రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లి వ్యవసాయ రంగంలో నూతన అంశాలను వివరించే వారు. ప్రస్తుతతం ఆత్మ సేవలు లేకపోవడంతో రైతులు చెందుతున్నారు. ఆ సేవలు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

News May 31, 2024

చివరగా పలమనేరు ఫలితం..?

image

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పలమనేరులో 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అత్యల్పంగా చిత్తూరులో 226, నగరిలో 229 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి ఈవీఎంల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చిత్తూరు లేదా నగరి ఎమ్మెల్యే ఎవరనేది ముందుగా తెలుస్తుంది. చివరగా పలమనేరు ఫలితం తేలే అవకాశం ఉంది. చిత్తూరు SVసెట్‌లో కౌంటింగ్ జరుగుతుంది.

News May 31, 2024

యువకుడి మోసం.. బాలిక ఆత్మహత్యాయత్నం

image

ప్రేమ పేరుతో మోసగించిన ఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో వెలుగు చూసింది. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి వివరాల మేరకు.. దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించాడు. ‘కులాలు వేరు కావడంతో నా తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఏమైనా చేసుకో’ అని యువకుడు బాలికతో అన్నాడు. దీంతో ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతోంది.

News May 30, 2024

చిత్తూరు: కత్తులతో దాడులు

image

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేటలో కత్తులతో దాడులు చేయడం కలకలం రేపింది. వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో గ్రామంలోకి చొరబడి వీరంగం సృష్టించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు ఉమాశంకర్, నాగభూషణం, గిరిప్రసాద్‌ ఇళ్ల వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేశారని చెప్పారు. నాగభూషణం తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

కుప్పంలో యువకుడి ఆత్మహత్య

image

చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మునిసిపాల్టీ పరిధిలోని బైరుగానిపల్లె సమీపంలోని ఓ చెట్టుకు యువకుడు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. వెంటనే కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు బైరుగానిపల్లెకు చెందిన చెందిన అంజి(30)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

కొత్త లుక్‌లో మంత్రి పెద్దిరెడ్డి

image

ఎన్నికల పోలింగ్ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు.తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ చోట్ల వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో రిలాక్స్ కోసం విహార యాత్రలకు వెళ్లారు. ఈక్రమంలో ఆయన కొత్త లుక్‌లో దర్శనం ఇచ్చారు. సాధారణంగా ఆయన ఎప్పుడూ తెల్లదుస్తుల్లో ఉంటారు. విహార యాత్రలో టీషర్టు ధరించి కళ్లజోడు పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది.

News May 30, 2024

మదనపల్లెలో గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం

image

మదనపల్లె వారపు సంత క్రాస్ వద్ద ఉండే గ్యాస్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించడంతో సిబ్బందితో వెళ్లి మంటలు అదుపు చేశామన్నారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌ను సైదాపేటకు చెందిన భాష గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News May 30, 2024

జగన్ గెలిస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు పోస్టర్లు అతికిస్తా: కిరణ్ రాయల్

image

జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సజ్జల మాట్లాడిన మాటలు రాజకీయ విధ్యంసం పెంచే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ వద్ద హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు.

News May 30, 2024

పుంగునూరు: తగ్గుతున్న టమాటా ధరలు

image

టమోటా ధరలు మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర సోమవారం రూ.600 పలికింది. అప్పటి నుంచి రోజుకు వంద చొప్పున తగ్గుతూ బుధవారం నాటికి రూ.350 అధిక ధర పలకగా.. మొత్తంగా రూ.300కు చేరింది. ప్రస్తుతం కోతల దశలో తోటలు ఉండడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News May 30, 2024

తిరుపతి: డిగ్రీ విద్యార్థులకు సెలవులు పొడిగింపు

image

ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు జూన్ 6వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు. గతంలో మే 31 వరకు ఉన్న సెలవులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 6వ తేదీ వరకు పొడిగించామన్నారు. జూన్ 7వ తేదీన కళాశాలలు పున: ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదేశాలను ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలు తప్పక పాటించాలని సూచించారు.