India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్యశాల నూతన భవనాన్ని చిత్తూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందికి ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు.

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.

పెనుమూరు(M) విడిదిపల్లికి చెందిన డి.అరవింద్ (17) ప్రేమ విఫలమై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్టోబర్ 24 నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థినితో అరవింద్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. నచ్చిన అమ్మాయి దూరమైందని డిప్రెషన్‌కు గురైన అరవింద్ నాన్న సారీ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

చిత్తూరు జిల్లాలో తొలిరోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 95.20 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2,67,786 మంది లబ్ధిదారులు ఉండగా 2,54,943 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛను సొమ్ము అందజేశారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో మిగిలిన 12,843 మందికి సోమవారం పింఛన్ ఇవ్వనున్నారు.
Sorry, no posts matched your criteria.