Chittoor

News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా.. దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’ అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

News October 2, 2024

3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

image

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబ‌రు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

News October 2, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా మంగళవారం 63,300 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి రూ.4.23 కోట్లు నిన్న హుండీ రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 2, 2024

తిరుపతి: స్వర్ణాంధ్ర 2047@ విజన్ ను ప్రణాళికలు సిద్ధం

image

జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా సర్ణాంధ్ర @ 2047 విజన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ స్వర్ణాంధ్ర@ 2047 అమలుపై ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, జిల్లా అధికారులతో ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

News October 1, 2024

చిత్తూరులో 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలియజేశారు. నగిరి, యాదమరి, పుంగనూరు మండలాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. బంగారుపాలెం, వీకోట, రామకుప్పం మండలాలు చివరి మూడు స్థానాలలో నిలిచాయి. సాయంత్రం లోపు లక్ష్యాలను చేరుకునేలా పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

News October 1, 2024

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు

image

కురబలకోట మండలంలోని సర్కార్ తోపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సాయంతో వెలికి తీస్తున్నారు.

News October 1, 2024

తిరుపతి: చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చిన కలెక్టర్, MLA

image

తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ లో స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చీపుర కట్టలు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News October 1, 2024

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలు పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఆలయం వెలుపల టీటీడీ ఈవో జే. శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

News October 1, 2024

వెదురుకుప్పం: బొమ్మయపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

image

వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి సర్పంచి గోవిందయ్య చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు దేవళంపేట వార్డు సభ్యుడు పయని డీపీవో, కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. నిధులు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ కావడంతో చెక్ పవర్ రద్దు చేసినట్టు అందులో పేర్కొన్నారు.

News October 1, 2024

చిత్తూరు: భవిత కేంద్రాల్లో ఖాళీలకు దరఖాస్తులు

image

భవిత కేంద్రాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బంగారుపాళ్యం, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, సోమల కేంద్రాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫిజియోథెరపీ డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల ఐదులోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు.