Chittoor

News July 28, 2024

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై ఆదేశాలు

image

తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు.

News July 27, 2024

చెవిరెడ్డి మోహిత్ అరెస్ట్.. ఇదీ కేసు

image

ఎన్నికల తర్వాత మే 14న పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలనకు పులివర్తి నాని వెళ్లారు. అక్కడ ఆయనపై దాడి జరిగింది. చెవిరెడ్డి అనుచరులు తనపై దాడికి పాల్పడినట్లు నాని ఫిర్యాదు చేయడంతో భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు. ఇటీవల 37వ నిందితుడిగా చెవిరెడ్డి <<13721816>>మోహిత్‌రెడ్డి<<>> పేరు చేర్చారు.

News July 27, 2024

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్?

image

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల తర్వాత చంద్రగిరి టీడీపీ అభ్యర్థి (ప్రస్తుత ఎమ్మెల్యే) పులివర్తి నానిపై దాడికి సంబంధించి మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News July 27, 2024

పోలీసుల అదుపులో ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడు!

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం కేసులో పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త బండపల్లి అక్కులప్పను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎంపీ మిథున్ రెడ్డికి అక్కులప్ప ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు భూ అక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

News July 27, 2024

చంద్రబాబు, పెద్దిరెడ్డి క్లాస్మేట్స్ కాదు: దొరబాబు

image

‘ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు క్లాస్మేట్స్. అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారు’ అంటూ మాజీ సీఎం జగన్ నిన్న చేసిన కామెంట్స్‌లో నిజం లేదని చంద్రబాబు క్లాస్మేట్ దొరబాబు తెలిపారు. ‘ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుకు పెద్దిరెడ్డి జూనియర్. జగన్ అబద్ధాలు చెప్పారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చంద్రబాబు చురుగ్గా ఉండేవారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News July 27, 2024

శ్రీకాళహస్తి: భారీ ఐరన్ పైపు మీదపడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు ఐరన్ పైపు మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. స్థానికుల కథనం.. రాచగున్నేరి సమీపంలోని ఓ కంపెనీలో లారీలోకి పైపులు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ ఐరన్ పైపు మీద పడటంతో కాపు గున్నేరు గ్రామానికి చెందిన ప్రసాద్ (48) తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 27, 2024

కేవీ పల్లి: కర్రతో అల్లుడు దాడి.. అత్త మృతి

image

అత్తను అల్లుడు దారుణంగా కొట్టి చంపిన ఘటన కేవీ పల్లి మండలంలో చోటుచేసుకుంది. కేవీ పల్లి(M) వగళ్ల గ్రామం నార్మకలపల్లికి చెందిన సురేశ్ భార్య నీలవతి(46)ను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేవీ పల్లి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలకడ CI శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News July 27, 2024

నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు

image

చిత్తూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25వ విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పరీక్ష జనవరి 18న నిర్వహిస్తామన్నారు.

News July 27, 2024

మదనపల్లె: పోలీసుల అదుపులో వైసీపీ నేత!

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసు అధికారులు దూకుడు పెంచారు. మదనపల్లె వైసీపీ నేత, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే మరో వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లోను తనిఖీలు చేయడానికి వెళ్లిన అధికారులకు సహకరించలేదని సమాచారం.

News July 27, 2024

కలికిరి: మర్రికుంటపల్లి వీఆర్ఓపై ఏసీబీ అధికారులు విచారణ

image

కలికిరి మండలం మర్రికుంటపల్లి వీఆర్వో క్రిష్ణయ్యపై ఎంఆర్ఓ సమక్షంలో ఏసీబీ అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. కామాక్షి అనే మహిళకు గజ్జలవారిపల్లి గ్రామం వద్ద తల్లి నుంచి సంక్రమించిన 23సెంట్ల భూమి ఆన్లైన్ చేయాలని వీఆర్ఓ ను ఆశ్రయించింది. వీఆర్ఓ రూ.5లక్షలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఆన్లైన్ చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా వారి ఆదేశాలతో ACB అధికారులు విచారణ చేపట్టారు.