Chittoor

News September 25, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం తమ్ముడు గుండెపోటుతో మృతి

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమ్ముడు కోనేటి పాండురంగం (68) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. నారాయణవనం మండలం భీముని చెరువుకు చెందిన కోనేటి పాండురంగంను రెండు రోజులక్రితం అస్వస్థతకు గురికావడంతో తిరుపతిలోని స్వీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 25, 2024

లడ్డూ వివాదంపై CBIతో విచారణ జరిపించాలి: MP మిథున్

image

తిరుమల లడ్డూ ఘటనపై CBIతో విచారణ జరిపించాలని MP మిథున్ రెడ్డి అన్నారు. తిరుమలలో నెయ్యి ఆర్డర్ ఇచ్చింది, శాంపిల్ టెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే అని ఎంపీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నిజం బయటికి రావాలంటే CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. టీటీడీ ఈఓ శ్యామల రావు భిన్న సమాధానాలు చెబుతున్నారని, ఆఫీసర్ల మీద ఒత్తిడి తెస్తున్నారన్నారు.

News September 25, 2024

తగ్గిన శ్రీవారి భక్తుల రద్దీ..

image

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. దీంతో భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్‌గా స్వామి వారి దర్శనానికి వెళుతున్నారు. కాగా నిన్న శ్రీ వారిని 67,166 వేల మందికి పైగా దర్శించుకన్నట్లు అధికారులు తెలిపారు.

News September 25, 2024

కాణిపాకం: చంద్రప్రభ వాహనంపై వినాయకుడు విహారం

image

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి వినాయక స్వామి చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనము ఇచ్చారు. భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురు ప్రసాద్, ఏ ఈ ఓ విద్యాసాగర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు.

News September 24, 2024

కుప్పం: ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా మునిరత్నం

image

ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా కుప్పం టీడీపీ ఇన్‌ఛార్జ్ మునిరత్నంను ప్రభుత్వం నియమించింది. సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్‌మెంట్ అయిన మునిరత్నం గడిచిన నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మునిరత్నంను ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం పట్ల కుప్పం టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 24, 2024

పోలీస్ స్టేషన్‌లో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు జిల్లా SRపురానికి చెందిన కుమార్ ఒంగోలు PSలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందిన సమాచారం..అప్పులు చేసి పరారై ఒంగోలు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అప్పులోళ్లు శనివారం ఒంగోలు వచ్చి టీడీపీ నేత సాయంతో ఘర్షణకు దిగారు. పోలీసులు అందరినీ స్టేషన్‌కు పిలిపించి సర్ది చెప్పారు. మళ్లీ వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి.. SI చేయిచేసుకున్నాడంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

News September 24, 2024

చిత్తూరు: 119 రోడ్డు ప్రమాదాల్లో 64మంది మృతి

image

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో ఎస్పీ మణికంఠ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగిన 119 రోడ్డు ప్రమాదాలలో 64 మంది మరణించగా, 211 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ప్రమాదాల నివారణకు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

News September 24, 2024

చిత్తూరు లాడ్జీలో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

image

వ్యభిచారం చేస్తున్న పదిమందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఓ లాడ్జీలో వ్యభిచారం చేస్తున్న ఏడుగురు విటులు, ఇద్దరు మహిళా బాధితులతో పాటు నిర్వాహకురాలు రజియా బేగంను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధిత మహిళలను వారి తల్లిదండ్రులకు అప్పగించి, తిరిగి ఈ వృత్తిలోకి రాకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు.

News September 24, 2024

చిత్తూరు: పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

image

ఉద్యానవన శాఖలో అమలు చేస్తున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో పథకాలను తెలిపే పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40% రాయితీ అందిస్తున్నట్టు చెప్పారు. పాలి హౌసులు, షెడ్ నెట్ హౌసులు, మల్చింగ్ కు 50% రాయితీ అందిస్తున్నామన్నారు. చిన్న ట్రాక్టర్లు, స్ప్రేయర్లు రాయితీతో అందిస్తామన్నారు.

News September 23, 2024

3న తిరుమలకు పవన్..?

image

తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆయన అక్టోబర్ 3న తిరుమలకు వచ్చే అవకాశం ఉందని జనసేన నాయకులు వెల్లడించారు.