India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పెన్షన్లు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్ దారులకు రూ.112.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేయునట్లు తెలిపారు.

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తవణంపల్లె మండలం పైమాఘానికి చెందిన రాజేశ్వరి తన భర్తతో కలిసి మొగిలీశ్వర స్వామి గుడికి బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరికి అక్కడికక్కడే చనిపోగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ మాంసం కిలో. 184, స్కిన్ లెస్ మాంసం కిలో రూ. 210, లేయర్ మాంసం కిలో రూ.145 కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. బర్డ్ ప్లూ అనంతరం చికెన్ ధరలలో పెరుగుదల కనబడుతోంది. పండుగల కారణంగా చికెన్ ధరలు పెరిగినట్టు పలువురు తెలుపుతున్నారు. మీ ప్రాంతాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

సోమవారం రంజాన్ పండుగ కావడంతో మీ కోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి ఈనెల 31న రావద్దని విజ్ఞప్తి చేశారు.

తాము ఎందులోను తక్కువ కాదంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు మహిళలు నిరూపిస్తున్నారు. ఇటీవల వినూత్నంగా చీరలు తయారు చేసి రాష్ట్రపతిని శ్రీకాళహస్తి మహిళ మొప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సోమలకు చెందిన సంజన ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ ఉద్యోగానికి ఎంపికై అందరి చేత శభాష్ అనిపించింది. చిత్తూరులో జిల్లాలో ఈ ర్యాంక్ స్థాయి ఉద్యోగాన్ని పొందిన మొదటి మహిళ సంజనే అంటూ ఆమె కుటుంబీకులు తెలిపారు.

ఉగాదిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉగాది ఉత్సవం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, ప్రముఖ వ్యక్తులకు సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఉగాది వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.

ఉగాది పర్వదినాన్ని జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ శనివారం కోరారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం, ఆయుషు, ఆనందం, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రజలకు పోలీసు శాఖ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.