Chittoor

News July 17, 2024

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

image

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

News July 17, 2024

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా

image

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్‌లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

News July 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జులై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జులై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

News July 17, 2024

చిత్తూరు: పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

చిత్తూరు జిల్లాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కుప్పం నుంచి కేజీఎఫ్ బయల్దేరిన బస్సుకు శాంతిపురం మండలం రాళ్లబుదుగురు సమీపంలో ఎదురుగా ఓ బైకు వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News July 17, 2024

చంద్రగిరిలో దొంగ ఓట్లపై సీఐడీ విచారణ

image

చంద్రగిరిలో దొంగ ఓట్లపై అప్పట్లో ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి ఆఫీసు నుంచే ఒక్క రాత్రిలోనే దొంగ ఓట్లకు 10 వేల అప్లికేషన్లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల జాబితా తయారీ తిరుపతి RDO చేయాల్సినప్పటికీ.. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గూడూరు RDO ఇందులో కీలకంగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నిన్న CID అధికారులు తిరుపతి ఆర్డీవో, తుడా ఆఫీసులకు వెళ్లి వివరాలు ఆరా తీశారు.

News July 17, 2024

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని మంగళవారం 71,409 మంది దర్శించుకున్నారు. 26,128 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.15 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారని టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు.

News July 17, 2024

పెద్దిరెడ్డి ఫ్యామిలీ 3వేల ఎకరాలు కబ్జా చేసింది: మంత్రి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 3 వేల ఎకరాలను కబ్జా చేశారు. పులిచెర్ల, అంగళ్లు, పుంగనూరు, తిరుపతిలో భూములు కాజేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రూ.కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చైనాకు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు’ అని మంత్రి ఆరోపించారు.

News July 17, 2024

తిరుపతి: IGNOUలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ (UG), పిజి (PG), పీజీ డిప్లమా సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://www.ignou.ac.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.

News July 17, 2024

కుప్పం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కుప్పంతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.

News July 16, 2024

తిరుపతి : LLB ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 3/5 సంవత్సరాల ఎల్.ఎల్.బి (CBCS) 5,9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.