India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.151 ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ రూ. 172గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. లేయర్ కోడి మాంసం కిలో రూ.145కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మీ సమీప ప్రాంతాలలోని చికెన్ దుకాణాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

అన్న కోసం ఎదురు చూసిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. నగరి మండలం వీకేఆర్ పురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగనన్న కాలనీలో ఉంటున్న నోమేశ్వరి(10) మృతి చెందగా, ఆమె సోదరుడు మహేశ్ గాయపడిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడి కావడంతో అన్న కోసం ఎదురు చూసిన నోమేశ్వరి.. మహేశ్ రాగానే ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.

GDనెల్లూరుతోపాటూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా YCPనేతలు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల కోసం క్యాడర్‌ను ఇప్పటి నుంచే బలోపేతం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ కీలక నేతలు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, వెంకటేగౌడ, రోజా తదితరులు ఎప్పటికప్పుడూ కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు CM చంద్రబాబు సైతం టీడీపీ నేతలకు ప్రజల్లో ఉండాలని ఆదేశించారు.

యువకులు బెట్టింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు సీఐ శ్రీనివాసంతి శనివారం తెలిపారు. ఐపీఎల్ మోజులో పడి యువకులు బానిసలు కాకూడదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బెట్టింగ్ గురించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని ఆమె కోరారు.

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని సచివాలయంలో నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఎక్కడన్నా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

➤ ఎర్రిస్వామి: వీఆర్ TO చిత్తూరు 1టౌన్
➤ వెంకటరమణ: వీఆర్ TO చిత్తూరు 2 టౌన్
➤ప్రసాద్: చిత్తూరు 2 టౌన్ TO బంగారుపాళ్యం
➤సహదేవి: పెద్దపంజాణి TO పీసీఆర్ చిత్తూరు
➤తులసన్న: వీఆర్ TO సీసీఎస్, చిత్తూరు
➤రామచంద్రయ్య: వీఆర్ TO పెనుమూరు
➤విజయ్ నాయక్: వీఆర్ TO నగరి
➤వెంకటనారాయణ: వీఆర్ TO ఎన్ఆర్ పేట
➤బలరామయ్య: విజయపురం TO డీటీసీ చిత్తూరు
➤వెంకటరమణ: వీఆర్ TO పుంగనూరు
➤ధనంజయరెడ్డి: వీఆర్ TO పెద్దపంజాణి

చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడారు.

చిత్తూరు నగరంలోని పలు మెడికల్ షాపులను గరుడ బృందం శుక్రవారం తనిఖీ చేసింది. నిషేధిత మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దుకు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ప్రతిపాదనలు పంపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ ఎస్ఐ అనిల్, వెంకట రవి పాల్గొన్నారు.

పలమనేరు రెవెన్యూ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సోమల తహశీల్దార్ శాంప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. పలమనేరులో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డివిజనల్ గౌరవ అధ్యక్షుడిగా మాధవ రాజు, ఉపాధ్యక్షుడిగా యోగానంద్, మోహన్ రెడ్డి, తహసీన, జనరల్ సెక్రటరీగా అనిల్ కుమార్, మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్‌కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.