Chittoor

News September 14, 2024

చిత్తూరు: రాళ్లు పడి గాయపడ్డ వారిలో ఒకరు మృతి

image

ఎన్ హెచ్ పనులవద్ద టిప్పర్ పై నుంచి రాళ్లు పడి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి కథనం.. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు శనివారం ములకలచెరువు, మదనపల్లె ఎన్ హెచ్ పనులు తుమ్మనగుట్టలో చేస్తున్నట్లు చెప్పారు. పని జరిగేచోట టిప్పర్లోని రాళ్లు వారిమీదపడి గాయపడగా, మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. వారిలోబీహారుకు చెందిన అతుల్ కుమార్ సింగ్ మృతి చెందాడన్నారు.

News September 14, 2024

నాపై విష ప్రచారం చేసిన మీడియా సంస్థకు నోటీసులు: పెద్దిరెడ్డి

image

తనపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు పంపినట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఓ న్యూస్ ఛానల్‌కు పరువునష్టం కింద రూ.50 కోట్లకు న్యాయవాదులు నోటీసులు పంపారని తెలిపారు. నిరాధారంగా వార్తలు రాసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయ పరంగా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

News September 14, 2024

తిరుపతి: సినిమా థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి

image

తిరుపతిలోని సినిమా థియేటర్‌లో ఎంబీయూ యూనివర్శిటీ విద్యార్థి లోకేశ్‌పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తో పాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరు పేట కాగా, బాధితుడిది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా గుర్తించారు.

News September 14, 2024

తిరుమలలో సమాచారం@ 7AM

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని టీటీడీ తెలిపింది. శనివారం ఉదయం 7గంటల సమయానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్తున్న వారికి 12 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు. శని,ఆదివారాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి సేవకు హాజరైనట్లు తెలుస్తోంది.

News September 14, 2024

చిత్తూరు SP స్ట్రాంగ్ వార్నింగ్

image

ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మొగిలిలో ప్రమాద ఘటనను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రహదారి లోపాలను సరిదిద్దడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News September 14, 2024

చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

image

చిత్తూరు: సరైన వర్షపాతం లేని కారణంగా పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. పంట నష్ట నివారణకు జిల్లా రైతాంగం వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. రెండు శాతం యూరియా ద్రావణం, 10రోజల వ్యవధిలో 19-19-19 ఎరువును రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. స్పింకర్ల ద్వారా నీరు పిచికారీ చేయాలన్నారు.

News September 14, 2024

వరద బాధితులకు తిరుపతి అధికారుల సాయం

image

విజయవాడ వరద బాధితులకు తిరుపతి జిల్లా అధికారులు అండగా నిలిచారు. ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున తమ వంతు సాయం చేశారు. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి రూ.7.47 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు.

News September 13, 2024

ఆచూకీ తెలిస్తే తెలపండి: బంగారుపాళ్యం సీఐ

image

మొగిలి ఘాట్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అందులో ఐడుగురి వివరాలను గుర్తించారు. పై ఫొటోలో ఉన్న ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. వాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే బంగారుపాళ్యం సీఐను 9440796736లో సంప్రదించాలి. చిత్తూరు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ నెంబర్ 9440900005కు కాల్ చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో కోరారు.

News September 13, 2024

వైసీపీ PAC మెంబర్‌గా పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షుడిగాను అవకాశం కల్పించారు. మరోవైపు మాజీ మంత్రి రోజా, తిరుపతి మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

News September 13, 2024

చిత్తూరు: ప్రమాదంలో మృతి చెందింది వీరే..!

image

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(M) మొగిలి ఘాట్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదుగురి వివరాలు గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. బల్లరాజు(సిద్దిపేట, తెలంగాణ), ఎ.విజయ(పాకాల మండలం కంబాలమెట్ట), మనోహర్(ఆర్టీసీ డ్రైవర్) ,బేబీ హన్సిక(యూపీ), సోను కుమార్(ఉత్తరప్రదేశ్) చనిపోయినట్లు గుర్తించారు.