Chittoor

News February 6, 2026

చిత్తూరు: హజ్ యాత్రికులకు రేపు వైద్య పరీక్షలు

image

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు శనివారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖాజీముల్ హుజా జ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడంతో పాటు వ్యాక్సిన్ వేస్తారన్నారు.

News February 6, 2026

చిత్తూరు జిల్లా టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్.!

image

టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తత్కాల్ ద్వారా శుక్రవారం నుంచి ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అవకాశం కల్పించినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. వెయ్యి రూపాయల అపరాధ రుసుమును ఆన్‌లైన్‌లో ఈనెల 12లోపు చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని పరీక్షా విభాగాన్ని సంప్రదించాలని ఆయన కోరారు.

News February 5, 2026

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

image

ఉద్యోగాల పేరుతో ఫోన్ కాల్స్ చేసి డబ్బులు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరించారు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు, నెలకు రూ.32 వేల జీతమని నమ్మించి రెజ్యూమ్, ఆధార్, పొటోలు తీసుకొని ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద కాల్స్‌పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మీకూ ఇలాంటి కాల్ వచ్చిందా?

News February 5, 2026

అలా చేస్తే ఆకలి చావులు తప్పవు: YS షర్మిల

image

ఉపాధి హామీని నిర్వీర్యం చేసి అందులో మిగిలిన డబ్బులను బినామీలకు, తమ నాయకులకు పంచేందుకు BJP కుట్రలు పన్నుతోందని APకాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. పుంగనూరులో గురువారం ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని మాజీ సీఎం YSR ఎంతో ఘనంగా అమలు చేశారన్నారు. ఈ పథకం లేకపోతే వలసలు, ఆకలి చావులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉపాధి లేకపోతే మరింత మందికి పని ఉండదన్నారు.

News February 5, 2026

పుంగనూరు: ‘12 కోట్ల కుటుంబాల మీద ప్రభావం’

image

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఉపాధిపై ఆధారపడ్డ 12 కోట్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతాయని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. పుంగనూరులో గురువారం నిర్వహించిన ఉపాధి పరిరక్షణ యాత్రలో ఆయన మాట్లాడారు. పలు రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, ఉపాధి భారం వాటి మీద మోపడంతో పనులు దొరికే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తున్నట్టు ఆయన చెప్పారు.

News February 5, 2026

చిత్తూరు: ఇక అంతా రైతు చేతుల్లోనే.!

image

రైతులు తమంతకు తామే సాగుచేసిన పంటల వివరాలను యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. నూతనంగా రూపొందించిన ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా రైతులు సాగు చేసే పంటలను నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గతంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా మాత్రమే ఈ-పంట నమోదుకు అవకాశం ఉండేది. రబీ సీజన్లో పంటలు సాగుచేసిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 5, 2026

చిత్తూరు: ఆ MLAకు సత్తా ఉన్నా.. మౌనమే.?

image

పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపినా నేడు నియెజకవర్గానికే పరిమితం అయ్యారు. పెద్దిరెడ్డి వంటి నేతలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్నా, కల్తీ నెయ్యి, YCP విమర్శలను తిప్పికొట్టే చాతుర్యం ఉన్నా ప్రెస్‌మీట్లకే హాజరవుతున్నారట. మంత్రి పదవి రాకపోవడం, జిల్లాలో ప్రాధాన్యత దక్కకపోవడం కారణంగా తెలుస్తోంది. మళ్లీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాక్టివ్ అవుతారా, మౌనంగానే ఉంటారో చూడాలి.

News February 5, 2026

చిత్తూరు: నేడు రానున్న 400 టన్నుల యూరియా

image

జిల్లాలో 2,442 టన్నుల యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. రైతు సేవా కేంద్రాల పరిధిలోనే ఈ యూరియాను అధికంగా ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. నేడు(గురువారం) మరో 400 టన్నుల యూరియా రానుందన్నారు. ఆ యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందేలా చూస్తామన్నారు.

News February 5, 2026

చిత్తూరు: నలుగురు అరెస్ట్

image

చిత్తూరులో పేకాట ఆడుతున్న నలుగురిని బుధవారం రాత్రి 2- టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. యాదమరి జంక్షన్ వద్ద జూదం ఆడుతున్నారని తెలుసుకున్న 2-టౌన్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య పోలీసు బృందంతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4వేల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

News February 4, 2026

చిత్తూరు: పోస్టాఫీసులో ఉద్యోగాలు.. APPLY చేసుకోండి.!

image

చిత్తూరు డివిజనల్ పోస్టాఫీస్ పరిధిలో 23 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏబీపీఎం, బీపీఎం, డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. https://www.indiapost.gov.in/ లో ఈనెల 16 లోపు దరఖాస్తు చేయాలన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలలోపు, పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు.