Chittoor

News February 1, 2026

మన చిత్తూరు జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

image

సంక్రాంతి పండుగ తర్వాత చికెన్ ధరలలో తగ్గుదల కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.153 నుంచి రూ.157, మాంసం రూ.222 నుంచి 240 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.252 నుంచి రూ.265 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 1, 2026

చిత్తూరు: 91% పింఛన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ తొలి రోజైన శనివారం జిల్లా వ్యాప్తంగా 91.38 శాతం జరిగినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. జిల్లాలో 2,34,167 మందికి గాను తొలి రోజున 2,13,978 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారని ఆమె వెల్లడించారు. ఆదివారం సెలవు కావడంతో, సోమవారం మిగిలిన లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నట్లు చెప్పారు.

News February 1, 2026

చిత్తూరు: మార్చి 11 వరకు గడువు

image

చిత్తూరులో అనధికారికంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ ఓ ప్రకటనలో కోరారు. బీపీఎస్ దరఖాస్తులకు ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపారు. 2025 ఆగస్టు 31వ తేదీ ముందు వరకు నిర్మించిన భవనాలను ఈ పథకంలో క్రమబద్దీకరించు కోవచ్చన్నారు.

News February 1, 2026

చిత్తూరు: క్రమబద్ధీకరణకు గడువు పెంపు

image

అనుమతులు లేని లే-అవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ వరకు గడువు పొడిగింపు అమల్లో ఉంటుందన్నారు. గడువు పూర్తయ్యాక క్రమబద్ధీకరించుకోని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News February 1, 2026

చిత్తూరు- కుప్పం మధ్య కొత్త రైల్వేమార్గం: CM

image

చిత్తూరు-కుప్పం మధ్య కొత్త రైలుమార్గం ప్రతిపాదన ఉందని CM చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం రాత్రి పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కుప్పం నుంచి వివిధ ప్రాంతాలను కలిపేలా మంచి రహదారి నెట్వర్క్ ఉందన్నారు. కృష్ణగిరి-పలమనేరు, చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారులతోపాటు కొత్తగా బెంగుళూరు నుంచి KGF మీదుగా చెన్నైకి మరో రహదారి రానుందని తెలిపారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులను కూడా లింక్ చేస్తామన్నారు.

News February 1, 2026

కుప్పంలో CM నేటి పర్యటన షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం TDP శ్రేణులతో సమావేశం కానున్నారు. ఉదయం 9 గంటలకు కడపల్లి నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. 10 గంటలకు తులసినాయనపల్లి వద్ద బహిరంగ సభ నిర్వహించిన ప్రాంగణంలో మండలాల వారిగా పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.

News February 1, 2026

చిన్నారి మాటలకు చలించిన చిత్తూరు MLA.. తల్లికి సాయం!

image

పింఛన్ల పంపిణీకి వెళ్లిన చిత్తూరు MLA జగన్మోహన్‌ను ఓ బాలిక మాటల చలింపజేశాయి. చిన్నారి లక్షిక.. తన తల్లి లంగ్స్ సమస్యతో ఇబ్బంది పడుతుందని ఒక్కసారి వచ్చి మాట్లాడాలని కన్నీటితో MLAను కోరింది. స్పందించిన ఆయన స్వయంగా చిన్నారి ఇంటికి వెళ్లి బాలిక తల్లితో మాట్లాడారు. ఐదేళ్లుగా ఆక్సిజన్ సిలిండర్‌తోనే జీవిస్తున్నట్లు ఆమె చెప్పారు. స్పందించిన MLA పోర్టబుల్ ఆక్సిజన్ యంత్రం, బాలికకు సైకిల్ అందజేశారు.