Chittoor

News February 4, 2026

హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వసతి గృహంలో కచ్చితంగా ఆర్వో ప్లాంట్, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలన్నారు. ప్రతి హాస్టల్ కు రూ. 50 వేల నిధులు మంజూరు చేస్తామన్నారు.

News February 4, 2026

చిత్తూరు జిల్లాలో 185 సమస్యలు గుర్తించాం: SE

image

జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 110 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరంగా 6, LT లైన్ల పరంగా 60, సర్వీసు లైన్ పరంగా 15 కలిపి మొత్తం 185 సమస్యలను గుర్తించినట్లు SE ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 17 సమస్యలను పరిష్కరించామన్నారు.

News February 3, 2026

చిత్తూరు: బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని MJP గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సదుం, సత్యవేడు, తంబళ్లపల్లి, ఐతేపల్లి, కుప్పంలలో బాలురకు, కలికిరి, పీలేరు, ఉదయమాణిక్యం, పెద్దపంజాణి, పులిచెర్ల, కుప్పంలలో బాలికలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. http://mjpa pbcwreir.apcfrr.in లో దరఖాస్తు చేయాలన్నారు.

News February 3, 2026

మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

image

గత సీజన్‌లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

News February 2, 2026

చిత్తూరు జిల్లాలో విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి

image

వెదురుకుప్పం (M) పాతగుంట గ్రామానికి చెందిన జి మధు (3) సోమవారం వేడి నీటిలో పడి శరీరం పూర్తిగా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల అత్యవసర చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News February 1, 2026

పుత్తూరు: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

image

తిరుపతి–చెన్నై జాతీయ రహదారిపై గోవిందపాళ్యం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత,మనవడు మృతి చెందారు. ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బైక్‌ని బొలెరో ఢీకొనడంతో కళాప్పన్ (65) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన మనవడు విజయన్ (32) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 1, 2026

జాతీయస్థాయి కోకో జట్టుకు తీర్థం విద్యార్థుల ఎంపిక

image

జాతీయస్థాయి ఖోఖో జట్టుకు తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం లక్ష్మీపతి తెలిపారు. జనవరి 22న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన గంగాధర్, యశ్వంతి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచారు. దీంతో వారు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని HM, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News February 1, 2026

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

image

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్‌తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్‌తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.

News February 1, 2026

చిత్తూరు: 27 వేల మంది పాడి రైతులకు లబ్ధి

image

జిల్లాలో 19న మొదలైన ఉచిత పశు వైద్యశిబిరాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున 37 శిబిరాలు నిర్వహించగా.. 13 రోజుల్లో 718 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. మొత్తంగా 88,303 పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వైద్య సేవలు అందించడంతో 27,656 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లు జేడీ వివరించారు.

News February 1, 2026

నేడే కేంద్ర బడ్జెట్‌.. చిత్తూరు జిల్లా ఆశలు తీరేనా.?

image

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ద్రవిడ వర్సిటీని కేంద్ర వర్సిటీగా మార్చాలని లేదా ప్రత్యేక గ్రాంట్ల కోసం డిమాండ్ ఉంది. చిత్తూరులో స్కిల్ వర్సిటీ, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు, కుప్పం–పలమనేరు ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమల నేపథ్యంలో ఎగుమతి సుంకాల తగ్గింపు, GST సవరణల చర్చ సాగుతోంది. మామిడి గుజ్జు పరిశ్రమలు, బెల్లం మండీలకు క్లస్టర్ డెవలప్‌మెంట్ కింద కేంద్ర ప్రోత్సాహకాలు అందించాలని పలువురు కోరుతున్నారు.