Chittoor

News February 1, 2026

చిన్నారి మాటలకు చలించిన చిత్తూరు MLA.. తల్లికి సాయం!

image

పింఛన్ల పంపిణీకి వెళ్లిన చిత్తూరు MLA జగన్మోహన్‌ను ఓ బాలిక మాటల చలింపజేశాయి. చిన్నారి లక్షిక.. తన తల్లి లంగ్స్ సమస్యతో ఇబ్బంది పడుతుందని ఒక్కసారి వచ్చి మాట్లాడాలని కన్నీటితో MLAను కోరింది. స్పందించిన ఆయన స్వయంగా చిన్నారి ఇంటికి వెళ్లి బాలిక తల్లితో మాట్లాడారు. ఐదేళ్లుగా ఆక్సిజన్ సిలిండర్‌తోనే జీవిస్తున్నట్లు ఆమె చెప్పారు. స్పందించిన MLA పోర్టబుల్ ఆక్సిజన్ యంత్రం, బాలికకు సైకిల్ అందజేశారు.

News January 31, 2026

చిత్తూరు: రేపే కేంద్ర బడ్జెట్.. వీటికి నిధులు అందేనా.!

image

కీలక రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. కుప్పం–మారికప్పం రెండో రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో కుప్పం నుంచి KGF మీదుగా బెంగళూరుకు దూరం తగ్గనుంది. నడికుడి–శ్రీకాళహస్తి లైన్ పూర్తయితే గుంటూరు నుంచి తిరుపతి, చిత్తూరుకు ప్రయాణం మరింత సులువు కానుంది. అమరావతి–బెంగళూరు హైస్పీడ్ రైల్‌ ప్రతిపాదన ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం వీటికి ఏ మేర నిధులు కేటాయిస్తుందో చూడాలి.

News January 31, 2026

చిత్తూరు జిల్లాకు రూ.118.65 కోట్ల విడుదల

image

చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 2,75,073 మందికి రూ.118.65 కోట్లు విడుదలయ్యాయి. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లె పంచాయతీలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛన్లు అందజేయనున్నారు.

News January 31, 2026

నేడు CM చంద్రబాబు పర్యటన వివరాలు

image

CM చంద్రబాబు శనివారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటకు కడపల్లి ఇంటి నుంచి గుడిపల్లి (M) బెగ్గిలిపల్లిలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 10:40 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శాంతిపురం (M) తులసి నాయన పల్లి వద్ద ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఈ-సైకిళ్ల పంపిణీపై గిన్నిస్ బుక్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది.

News January 31, 2026

చిత్తూరు: ప్లాస్టిక్ వినియోగం తగ్గేనా..!

image

జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్లీ అది ఊపందుకుంది. ప్లాస్టిక్ నిషేధం ప్రస్తుతం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ప్లాస్టిక్ కవర్లను మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వాటి వినియోగం పర్యావరణ పరిరక్షణకు సవాలుగా మారింది. పూర్తిస్థాయిలో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News January 31, 2026

చిత్తూరు: ఊపందుకోనున్న శుభకార్యాలు

image

ఫిబ్రవరి మాసం నుంచి జిల్లాలో శుభకార్యాలు ఊపందుకోనున్నాయి. కొద్దిరోజులుగా సరైన ముహూర్తాలు లేక శుభకార్యాలు జరగడం లేదు. ఫిబ్రవరి నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కళ్యాణమండపాలను ఇప్పటికే ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఎక్కువగా పెళ్లి ముహూర్తాలకు వేదికలను సిద్ధం చేసుకుంటున్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగున్నాయి.

News January 30, 2026

కుప్పం: విద్యార్థుల మధ్య కూర్చున్న CM

image

CM చంద్రబాబు అగస్త్య ఫౌండేషన్‌లో విద్యార్థుల మధ్యలో కూర్చొని అగస్త్య 25 ఏళ్ల ప్రస్తావాన్ని వీడియో రూపంలో తిలకించారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించడంలో నవీనత, విజ్ఞానం, సాంకేతిక ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు. అకాడమీ ప్రతినిధులు విద్యార్థులకు తమ సైన్స్ & టెక్నాలజీ ఆవిష్కరణ కార్యక్రమంపై వినూత్నంగా రూపొందించిన వీడియోను ఆయన తిలకించారు.

News January 30, 2026

గుడిపల్లి: అగస్త్యలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు

image

గుడిపల్లి(M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో రూ.15 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు CM చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమిని CM ప్రారంభిస్తారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకాడమీ ఫెలిసిటీ, రూ.2 కోట్లతో నిర్మించనున్న ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు CM శంకుస్థాపన చేస్తారు. అనంతరం విద్యార్థులతో CM చంద్రబాబు ముఖాముఖి కానున్నారు.