Chittoor

News September 5, 2024

తిరుపతిలో ఘనంగా గురుపూజోత్సవం

image

తిరుపతి నగరంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాశ్, పులివర్తి నాని, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజ మార్గనిర్దేశకులు గురువులేనని తెలిపారు.

News September 5, 2024

CTR: వినాయక మండపాలకు కరెంట్ ఛార్జీలు ఇవే..! 

image

వినాయకస్వామి మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా తాత్కాలిక విద్యుత్తు సర్వీసు పొందాలని ఆ శాఖ చిత్తూరు జిల్లా SE సురేంద్ర నాయుడు సూచించారు. 500 వాట్స్ విద్యుత్తు వాడకానికి రూ.1100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 500-1000వాట్స్‌కు రూ.2350, 1000-1500 వాట్స్‌కు రూ.3,100, 1500-2000 వాట్స్ వరకు రూ.3,850 చెల్లించి మీ సేవా కేంద్రాల్లో తాత్కాలిక సర్వీసు తీసుకోవాలని చెప్పారు.

News September 5, 2024

రేపే చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో జరగనుంది. జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశామని సీఈవో గ్లోరియా తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా అధికారులు హాజరు కావాలని కోరారు.

News September 5, 2024

చిత్తూరు: వివాహేతర బంధానికి ముగ్గురు బలి

image

ఓ చిన్న తప్పుతో ముగ్గురు చనిపోయారు. శాంతిపురం(M) శిలామాకులరాయికి చెందిన రామచంద్ర(45)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ చేసే అతనికి హిందూపురానికి చెందిన గిరీశ్ పరిచయమయ్యాడు. ఈక్రమంలో గిరీశ్ భార్య శోభతో రామచంద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లి పురెమ్మ(68) చాలాసార్లు చెప్పినా రామచంద్ర మారకపోవడంతో సోమవారం ఆత్మహత్య చేసుకోగా.. రామచంద్ర, శోభ బుధవారం <<14020063>>సూసైడ్ <<>>చేసుకున్నారు.

News September 5, 2024

నేడు చిత్తూరులో గురుపూజోత్సవం

image

చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఈనెల 5వ తేదీ జిల్లాస్థాయి గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు.

News September 4, 2024

SVU: పీజీ ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఎడాది జులైలో జరిగిన M.A, M.Sc నాలుగో సెమిస్టర్ ఫలితాలు నేడు విడుదలైనట్లు విద్యాలయ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

News September 4, 2024

వి.కోటలో రెండో రోజూ 144 సెక్షన్

image

చిత్తూరు జిల్లా వి.కోట పట్టణంలో క్రికెట్ బాల్ వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే.  ఇరువర్గాల దాడి నేపథ్యంలో పోలీసులు వి.కోట పట్టణంలో నిన్న 144 సెక్షన్ అమలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. రెండు వర్గాల పెద్దలతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీ ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా వి.కోట పట్టణంలో బుధవారం రెండో రోజు 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.

News September 4, 2024

చిత్తూరు: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య?

image

చిత్తూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల మేరకు.. కుప్పం(M) మనేంద్రం గ్రామానికి చెందిన నారాయణస్వామి కుమారుడు సాగర్ బాబు(18) వి.కోట యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సాగర్ బాబు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు భూములు పోతాయనే ఆందోళనతోనే సాగర్ <<14010114>>చనిపోయాడని<<>> ఆమె అత్త చెప్పడం కొసమెరుపు.

News September 4, 2024

తిరుపతి: విమాన ప్రయాణికుడిపై కేసు నమోదు

image

విమానం టేకాఫ్‌కు అంతరాయం కలిగించిన ప్రయాణికుడిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జయచంద్ర వివరాల మేరకు.. తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం ఓ విమానం బయలుదేర్డానికి సిద్ధమైంది. టేకాఫ్ సమయంలో మయూర్ దిలీప్ హోలే అనే వ్యక్తి చేయి అత్యవసర స్విచ్‌కు తగలడంతో విమానం నిలిచిపోయింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.

News September 3, 2024

తిరుపతి: భర్త దారుణ హత్య.. భార్యకు జీవితఖైదు

image

కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో రేణిగుంట బుగ్గ వీధిలో ఉంటున్న ఎస్.వసుంధరకు జీవిత ఖైదును విధిస్తూ తిరుపతి 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన తీర్పు చెప్పారు. తనతో పాటు కుమారుడిని నిర్లక్ష్యం చేయడంతో ఆమె 2022 జనవరి 20న భర్త తలను నరికి మొండెంను వేరు చేసి తలను ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకుని రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయింది. కేసు నిరూపణ కావడంతో శిక్ష ఖరారు అయింది.