Chittoor

News August 25, 2024

కుప్పంలో 120 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ

image

కుప్పం రెస్కో పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి సుమారు 120 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో రెస్కో పరిధిలో జరిగిన ఉద్యోగ నియామకాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో విచారణ చేపట్టిన అధికారులు పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు నోటీసులకు సమాధానమివ్వాలని పేర్కొన్నారు.

News August 25, 2024

కుప్పం: ‘మన కష్టాలను జగన్‌కు చెబుదాం’

image

కుప్పంలో వైసీపీ కార్యకర్తల కష్టాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. శాంతిపురంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో వైసీపీ యువత ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో వైసీపీ క్యాడర్‌కు అండగా ఉండే నేతలు కరవయ్యారనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

News August 25, 2024

4 నుంచి తిరుమల బహ్మోత్సవాలు

image

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాల్లో భక్తులు, ఉద్యోగులు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది.

News August 25, 2024

చిత్తూరు: టమాటా ధరలు పతనం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు భారీగా తగ్గిపోయాయి. ఆగస్టు రెండో వారం నుంచి ధరలు క్రమేపి తగ్గుతున్నాయి. శనివారానికి మరింతగా దిగజారాయి. పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో నాణ్యత కలిగిన 15 కిలోల టమాటా బాక్సు ధర రూ.175కు చేరుకుంది. రెండో రకం రూ.100 లోపే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులైలో రూ.400, ఆగస్టు మొదటి వారం 15 కిలోల బాక్సు రూ.300 వరకు పలికింది.

News August 25, 2024

శ్రీకాళహస్తి: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!

image

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్ధిపేట(D) గజ్వేల్‌‌కు చెందిన శివ(26) పెయింటర్‌. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News August 25, 2024

CTR: ఆ మూడు చోట్ల నగరవనాల ఏర్పాటు

image

రాష్ట్రంలోని 11 నగరవనాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ రూ.15.4 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 3 నగరవనాలు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. పవన్ విడుదల చేసిన నిధులతో చిత్తూరు డెయిరీ వద్ద, కలగిరికొండ, శ్రీకాళహస్తి కైలాసగిరి వద్ద నగరవనాలను అభివృద్ధి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేలా పనులు చేస్తారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఇవి దోహదపడుతాయి.

News August 24, 2024

చిత్తూరు: విషాదం.. పెద్ద బండ పడి వ్యక్తి దుర్మరణం

image

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చీలాపల్లి ఈస్టర్ మలై వద్ద జరుగుతున్న చెన్నై జాతీయ రహదారి పనుల్లో ఓ బండరాయి మీద పడి కార్మికుడు మృతి చెందాడు. పైన ఉన్న బండ జారి కార్మికుడి పైన పడటంతో అతడు మట్టి దిబ్బలోకి కూరుకుపోయాడు. జేసీబీ సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 24, 2024

తిరుపతి: ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

image

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి పారామెడికల్ DP/DLMT కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను https://tirupati.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.

News August 24, 2024

CTR: అక్రమాల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్

image

ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలు, ఇబ్బందులు ఏర్పడితే తమకు ఫిర్యాదు చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 08572-299509 ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే chittoorsand75@gmail.comకు మెయిల్ చేయవచ్చన్నారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్, టిప్పర్ యజమానులు, వినియోగదారులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

News August 24, 2024

రిపోర్టర్‌కు శ్రీకాళహస్తి MLA బెదిరింపులు..?

image

ఏర్పేడు మండలంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.500 అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఓ ప్రముఖ పత్రికలో వార్త రాగా సదరు రిపోర్టర్‌కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన పీఏలతో ఫోన్ చేయించారు. ‘నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా. వైసీపీ పాలనలో ఇవి కనపడలేదా? ఇకపై వ్యతిరేక వార్త వస్తే నీ కథ ముగిసినట్లే’ అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.