Chittoor

News January 23, 2026

పారదర్శకమైన ఓటర్ల జాబితానే లక్ష్యం: DRO

image

చిత్తూరు కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో DRO మోహన్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించ వచ్చని ఆయన పేర్కొన్నారు.

News January 23, 2026

చిత్తూరు: మూడు విడతల్లో ప్రాక్టికల్స్

image

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మూడు విడతల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ డీఐఈవో తెలిపారు. మొదటి విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, రెండో విడత ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు, మూడో విడత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

News January 23, 2026

చిత్తూరు: హెక్టారుకు రూ.56 వేల రాయితీ.!

image

కొబ్బరి తోట పెంపకానికి ప్రభుత్వం రాయితీ అందించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఎకరాకు 72 చెట్ల చొప్పున నాటాల్సి ఉంటుందన్నారు. అలా నాటితే హెక్టారుకు రూ.56 వేల చొప్పున ప్రభుత్వం రాయితీగా అందిస్తోందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాపాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News January 23, 2026

అందుబాటులో 2,100 టన్నుల యూరియా

image

చిత్తూరు జిల్లాలో 2,100 టన్నుల యూరియా అందుబాటులో ఉందని డీఏఓ మురళీ తెలిపారు. 180 రైతు సేవా కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఇబ్బందిలేకుండా యూరియా అందిస్తామన్నారు. శుక్రవారం జిల్లాకు మరో 560 టన్నుల యూరియా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News January 22, 2026

సెలవుపై వెళ్లిన చిత్తూరు జేసీ

image

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఈ నెల 21 నుంచి 31వతేదీ వరకు సెలవులో ఉంటారని అధికారులు తెలియజేశారు. జేసీగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News January 22, 2026

ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

image

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.

News January 22, 2026

చిత్తూరు: రీసర్వేలో రైతుల భాగస్వామ్యం

image

రీసర్వేలో పలు లోటు పాట్లు చోటు చేసుకుంటుండడంతో వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇందులో రైతులను భాగస్వామ్యం చేసింది. రీ సర్వే ప్రారంభంలోను, ముగిసిన తర్వాత రైతుల ఈ కేవైసీ తీసుకోవాలని ఆదేశించింది. తద్వారా తప్పులు రైతులు గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాలుగో విడత రీ సర్వే పలుచోట్ల నిర్వహిస్తున్నారు. 101 గ్రామాలలో 1.15 లక్షల ఎకరాలలో రీ సర్వేను రెవెన్యూ అధికారులు చేపట్టనున్నారు.

News January 22, 2026

సెలవుపై వెళ్లిన చిత్తూరు జేసీ

image

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఈ నెల 21 నుంచి 31వతేదీ వరకు సెలవులో ఉంటారని అధికారులు తెలియజేశారు. జేసీగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News January 22, 2026

చిత్తూరు: 81 గ్రామాలలో పశువైద్య శిబిరాలు

image

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో బుధవారం 81 గ్రామాల్లో ఉచిత పశు వైద్యశిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. 825 పశువులకు సంతాన సాఫల్య చికిత్సలు, 130 పశువులకు కృత్రిమ గర్భధారణ, 136 పశువులకు కృత్రిమ లింగ నిర్ధారణ వీర్యంతో గర్భధారణ తదితర చికిత్సలను అందజేశామన్నారు. పాడి రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 22, 2026

చిత్తూరు: పక్క జిల్లాలోకి మారిన పోలీస్ స్టేషన్లు.!

image

పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మండలాలలోని స్టేషన్లను మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చేర్చారు. ఇది డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చినట్లు భావించాలని పేర్కొన్నారు.