Chittoor

News January 21, 2026

చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

image

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News January 20, 2026

క్రైం డేటాను నవీకరించాలి: చిత్తూరు ఎస్పీ

image

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తక్షణమే నవీకరించాలని.. క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలని ఎస్పీ తుషార్ ఆదేశించారు. పోలీస్ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ క్రైమ్ ఉచ్చులో ప్రజలు పడకుండా చూడాలన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు: ‘సైనికుల త్యాగాలను తెలియజేయాలి’

image

సైనికుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేయాలని ఎస్పీ తుషార్ సూచించారు. చిత్తూరు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ జాతీయ సైనికుల దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. జమ్ములో టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన అమరవీరుడు కార్తీక్ చిత్ర పటానికి ఆయన నివాళులు అర్పించారు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దుల్లో సైనికుల కృషియేనని ఆయన కొనియాడారు.

News January 20, 2026

పలమనేరు: 23 ఏనుగులు మృతి!

image

కౌండిన్య అభయారణ్యంలో నిన్న మొదటి ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా అటవీ పరిధిలో ఇప్పటివరకు 23 ఏనుగులు మృతి చెందాయి. గత పది ఏళ్లలో 15 ఏనుగులు కరెంట్ షాక్‌తోనే మృతి చెందాయి. ఏనుగులకు ప్రమాదాలు వాటిల్లకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News January 20, 2026

చిత్తూరు: నత్త నడకన పన్ను వసూళ్లు

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్ను వసూలు నత్తనడకన కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 శాతం కూడా పన్ను వసూలు కాలేదు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.32 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ.14 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అలాగే పుంగనూరులో రూ.6 కోట్లకు రూ.3.52 కోట్లు, నగరిలో రూ.4.98 కోట్లకు రూ.2.17 కోట్లు మాత్రమే వసూలు అయినట్టు అధికారులు చెప్పారు.

News January 20, 2026

చిత్తూరు; స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం

image

చౌడేపల్లి (M) కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు ఉదయం ఆవరణంలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసినట్లు సీసీ కెమెరాలులో నమోదయ్యాయి. ఈ ఘటన చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 20, 2026

చిత్తూరు: మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?

image

జిల్లాలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.1.72 కోట్ల బకాయిలు విడుదల చేసింది. 973 మందికి సబ్సిడీ కింద రావాల్సిన రూ.1,64,83,589 ప్రభుత్వం వారి వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. దీంతో పాటు నాన్ ఫార్మింగ్ సెక్టార్ కింద పట్టుశాఖకు అనుసంధానంగా చేపట్టిన పనులకు గాను రూ.7,31,800 నిధులు పట్టు పరిశ్రమ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు.

News January 20, 2026

కలెక్టర్‌ను కలిసిన పూర్వ విద్యార్థి సంఘం నాయకులు

image

ఐరాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలెక్టరేట్‌లో కలిశారు. తమ సంఘం ద్వారా ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో పాఠశాలను సందర్శిస్తానని తెలియజేశారు.