Chittoor

News January 25, 2026

చిత్తూరులో ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాంట్

image

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ రీ సైకిల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. శనివారం నగరిలో జరిగిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో చిత్తూరు నగరపాలక సంస్థ, జాగృతి టెక్ ప్రైవేటు లిమిటెడ్, వుయ్ కేర్ యూ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. రోజువారీగా ఉత్పత్తయ్యే సుమారు నాలుగు టన్నుల ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

News January 25, 2026

చిత్తూరు: నేటి నుంచి తేలికపాటి వర్షాలు

image

దక్షిణ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేడు(ఆదివారం), సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గిన విషయం తెలిసిందే.

News January 24, 2026

TDPకి కంచుకోట నగరి: CM

image

నగరి TDPకి కంచుకోట అని CM చంద్రబాబు అన్నారు. ‘వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణా జలాలు అందిస్తాం. కోసలను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం. యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. సమర్థవంతమైన MLAగా భాను పని చేస్తున్నాడు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేశాం. నేరస్థులు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూశాం. ఐదేళ్లలో నంబర్ వన్‌గా రాష్ట్రాన్నిఅభివృద్ధి చేస్తాం’ అని నగరిలో CM అన్నారు.

News January 24, 2026

రూ.1,417 కోట్ల చెక్‌ అందజేసిన CM

image

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 12,932 మహిళా సంఘాలకు రూ.1,417 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల మెగా చెక్‌ను సభ్యులకు శనివారం ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

News January 24, 2026

రొంపిచర్ల: ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న మిస్సింగ్ యువతి

image

రొంపిచర్ల R బెస్తపల్లిలో మూడో రోజుల క్రితం మిస్సయిన తేజశ్రీ(20) అనే యువతి తను ప్రేమించిన యువకుడు యోగేంద్ర రెడ్డి (24)ని పెళ్లి చేసుకుందని రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ తెలిపారు. వీరు భాకరాపేట సమీపంలోని దేవరకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారని చెప్పారు. మేజర్లు కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

News January 24, 2026

చిత్తూరు: వేతనం చెల్లించకపోతే కాల్ చేయండి

image

ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతం వీబీజీ- రామ్ జీగా మార్చిన సంగతి తెలిసిందే. కూలీలకు వేతనం చెల్లించకపోయినా, పని ప్రదేశంలో వసతులు లేక పోయినా, జాబ్ కార్డుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 1800 2001 001 టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సమస్యలపై ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News January 23, 2026

చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

image

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్‌లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.

News January 23, 2026

రాష్ట్రంలోనే తొలిసారి నగరిలో..!

image

నెట్ జీరో క్యాంపస్ కాన్సెప్ట్‌ను ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో తొలిసారి నగరి బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో అమలు చేయనున్నారు. ఇక్కడ ఎల్ఈడీ బల్బులు, 12 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తడి వ్యర్థాల నుంచి కంపోస్టు తయారీ చేస్తారు. వర్షపు నీటిని నిల్వ చేసి.. నీటి వృథాను తగ్గిస్తారు. పచ్చదనం కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు శనివారం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

News January 23, 2026

నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

image

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

News January 23, 2026

చిత్తూరు: రేపే చివరి అవకాశం

image

దళిత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం అజయ్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చిత్తూరు DRDA పీడీ శ్రీదేవి ఓ ప్రకటనలో కోరారు. అర్హులైన ఎస్సీ మహిళలు శనివారం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులను మండల మహిళా సమాఖ్యలో సమర్పించాలన్నారు. ఈ పథకంలో జిల్లాకు 205 యూనిట్లు కేటాయించారన్నారు.