Chittoor

News June 29, 2024

చిత్తూరు: టేబుల్ రకాల మామిడికి గిరాకీ ఎక్కువే..!

image

చిత్తూరులో జిల్లాలో టేబుల్ రకం మామిడికి మంచి ధర లభిస్తోంది. హిమామ్ టన్ను రూ.2 లక్షలు, బంగినపల్లి కాయల నాణ్యతను బట్టి టన్ను రూ.45 వేల నుంచి రూ.80 వేలు, కాలేపాడు రూ.50 వేల నుంచి రూ.80 వేలు, మల్గూబా రూ.లక్ష నుంచి రూ.1.2 లక్షలు పలుకుతున్నాయి. సీజన్ ముగిసిపోతుండడంతో రైతుల దగ్గర టేబుల్ రకాల కాయల లభ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో ధరలు పెరిగినా రైతులకు ఒరిగేది ఏమీ లేదని వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

News June 29, 2024

చిత్తూరు: ఆందోళనలో మామిడి రైతులు

image

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పంటకు సరైన ధర అందకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం టన్ను రూ.28వేలు పలికిన తోతాపురి మామిడి రకం తాజాగా రూ.24వేలకు పడిపోయింది. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్‌గా ధరలు తగ్గిస్తున్నారని వారు వాపోయారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 29, 2024

తిరుపతి- హిసార్ మధ్య ప్రత్యేక రైలు

image

తిరుపతి- హిసార్ మధ్య వారానికోసారి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. హిసార్- తిరుపతి (04717) రైలు ప్రతి శనివారం జులై 6 నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు, తిరుపతి- హిసార్ (04718) రైలు ప్రతి సోమవారం జులై 8 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు నడవనున్నాయి. గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ ఖాఘజ్నగర్, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్ తదితర స్టేషన్ల మీదుగా వెళుతుందని చెప్పారు.

News June 29, 2024

తిరుపతిలో భార్యాభర్తకు జైలుశిక్ష

image

చీటింగ్ కేసులో తిరుపతికి చెందిన భార్యాభర్తలకు జైలుశిక్ష పడింది. ఫిర్యాది తరఫు న్యాయవాది జి.వెంకట కుమార్ వివరాల మేరకు.. నగరానికి చెందిన కె.శ్రీనివాసులు, కె.ఓంకార లక్ష్మి ఒకరికి అప్పు తీర్చేందుకు భార్య పేరుతో ఉన్న చెక్‌పై భర్త సంతకం పెట్టారు. దీంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరికీ మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి ఎం.సంధ్యారాణి తీర్పు చెప్పారు.

News June 29, 2024

CTR: మామిడి రైతులకు సూచనలు

image

ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.

News June 29, 2024

తిరుమల: ఘాట్ రోడ్లోకి వచ్చిన ఏనుగులు

image

తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ఏనుగుల గుంపు కలకలం రేపింది. 7వ మైలు సమీపంలో దాదాపు 15 ఏనుగులు సంచారించాయని సమాచారం. అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేసి గజరాజులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అలాగే భక్తులను అప్రమత్తం చేశారు.

News June 28, 2024

బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల జైలుశిక్ష

image

చిత్తూరు: బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. గుడిపల్లె మండలానికి చెందిన 9వ తరగతి బాలికకు దేవరాజ్(26) మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2014 జూలై 5న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో దేవరాజ్‌కు 24 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి శాంతి తీర్పు చెప్పారు.

News June 28, 2024

కలకలం రేపుతున్న పెద్దిరెడ్డి సిఫార్సు లేఖ

image

గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి దర్శనం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిన లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫారసు లేఖపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బ్రేక్ దర్శనం స్కాం పైనా, శ్రీవాణి ట్రస్ట్ నిధుల మళ్లింపుపైనా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

News June 28, 2024

చిత్తూరు: మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో సమస్యలేంటి? కామెంట్ చేయండి.

News June 28, 2024

తిరుపతి: JRFకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఆఫ్ నానో ఎన్క్యాప్సిలేషన్ నాచురల్ ఆంటీ మైక్రో బయాల్స్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ ‌సైట్‌ను చూడాలని సూచించారు.