India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు.

బీసీ కార్పొరేషన్ దరఖాస్తు గడువును 12కు పెంచినట్లు చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకూ పెంచిందన్నారు.

అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బాణసంచా పేలి పలువురికి గాయాలైన ఘటన గంగవరం మండలంలో జరిగింది. దండపల్లి గ్రామానికి చెందిన మునివెంకటమ్మ(82) మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బాణసంచా పేల్చే క్రమంలో సంచిలో ఉన్న టపాకాయలకు నిప్పు అంటుకుని బాణసంచా జనంపైకి దూసుకెళ్లింది. దీంతో వెంకటరమణ, కుమార్, చిన్నబ్బ, చిన్నన్న, గురవయ్య, కుమార్ బాబుకి గాయాలు కాగా వారిని పలమనేరు, చిత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్‌లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.

చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పనితీరుకు 18వ ర్యాంకు లభించింది. రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. కాగా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి దక్కని సంగతి తెలిసిందే.

బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వి.కోట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మునెప్ప(69)అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లికి చెందిన మునెప్ప వీకోట మండలం బండపల్లిలో ఉన్న కూతురు వద్దకు బయలుదేరాడు. ఆంజనేయస్వామి గుడికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు.

సోమల మండలంలోని ఇరికిపెంట చిన్నపట్నం చెరువును అభివృద్ధి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడిని ఇరికిపెంట మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు కోరారు. గురువారం విజయవాడలో మంత్రిని కలిసిన ఆయన చెరువు కట్ట, తూములు, ఆయుకట్టు కాలువల అభివృద్ధికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

CM చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు ఇతర మంత్రులతోపోటీ పడి 6వ స్థానంలో నిలిచారు. కాగా చంద్రబాబు సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖను చూస్తున్న విషయం తెలిసిందే. మరింత వేగంగా పని చేయాలని CM మంత్రులను ఆదేశించారు.

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఈఓపీఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అధికారులు నీటి ఎద్దడి గ్రామాల వివరాలను తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

పలమనేరులో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటావూరుకు చెందిన షౌకత్ అల్లి అనే వ్యక్తి ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. గత కొంతకాలంగా అప్పువాళ్లు వచ్చి ఇంటిముందు అడుగుతుండడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్లేసరికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.