Chittoor

News August 19, 2024

తిరుపతి: నేడు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు

image

సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీసిటీకి వెళ్లతారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని ప్రభుత్వం తెలిపింది.

News August 19, 2024

పుంగనూరు: నీట మునిగి తల్లీబిడ్డ మృతి

image

పుంగనూరు నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. చౌడేపల్లె మండలం కాటిపేరికి చెందిన మౌనిక మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నిన్న సెలవు కావడంతో తన బిడ్డలు అనీషా రెడ్డి, తనీష్ రెడ్డితో కలిసి ఆవులను మేపేందుకు వెళ్లారు. ఆవు తాడును అనీషా రెడ్డి పట్టుకోగా.. అది బెదిరి నీటి గుంతల్లోకి లాక్కెళ్లింది. బిడ్డను కాపాడే క్రమంలో తల్లి కూడా నీటిలో మునిగిపోయింది. ఈత రాక ఇద్దరూ చనిపోయారు. 

News August 19, 2024

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బొజ్జల సమావేశం

image

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదివారం ఈఓ మూర్తి, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన తండ్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రారంభించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రాధాన్యతగా స్వీకరిస్తానని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

News August 18, 2024

బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన జగన్‌

image

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి వివాహానికి మాజీ సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. బెంగళూరు మారియట్ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పవిత్ర రెడ్డి, డాక్టర్ కౌశిక్ రెడ్డిలకు జగన్, భారతి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

News August 18, 2024

కార్యకర్త పాడె మోసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

image

రేణిగుంట మండల టీడీపీ సీనియర్ కార్యకర్త, యూనిట్ ఇన్‌ఛార్జ్ మునెయ్య అంత్యక్రియలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. అంతియ యాత్రలో ఆయన పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వరకు మోసి సానుభూతి తెలిపారు. మంచి కార్యకర్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News August 18, 2024

19న తిరుమ‌లలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ

image

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 19వ తేదీన శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గ‌రుడునిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది.

News August 18, 2024

తిరుపతి: బస్టాండ్ వద్దే ఆత్మహత్య

image

జాతీయ రహదారి పక్కనే ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు వద్ద హైవేపై బస్టాండ్ ఉంది. ఇక్కడే ఓ వ్యక్తి ఉరేసుకుని చనిపోయాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన వరదరాజన్(41)గా గుర్తించారు. అతను లారీ డ్రైవర్‌గా పని చేస్తాడని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతికి తరలించారు.

News August 18, 2024

తిరుపతి అగ్నిప్రమాదం విద్రోహ చర్యే: TDP

image

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై TDP అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ పలు అనుమానాలను లేవనెత్తారు. ‘ఇది కచ్చితంగా విద్రోహ చర్యే. TTD మాజీ ఛైర్మన్ భూమన, మాజీ EO ధర్మారెడ్డి హయాంలో రూ.1700 కోట్ల ఇంజినీరింగ్ పనుల కుంభకోణంపై విచారణ కీలక దశకు చేరుకుంది. అధికారులకు నోటీసులూ ఇచ్చారు. ఈ సమయంలోనే ప్రమాదం జరగడంపై చాలా అనుమానాలు ఉన్నాయి’ అని అన్నారు.

News August 18, 2024

కుప్పం: ట్రాక్టర్ చోరీ కేసులో వైసీపీ నేతల అరెస్ట్

image

కుప్పం(M) మల్లానూరు సచివాలయం ట్రాక్టర్ చోరీ కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ట్రాక్టర్ కనపడటం లేదని జనవరి 23న పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 25న కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వైసీపీ కుప్పం మండల అధ్యక్షుడు హెచ్ఎం మురుగేశ్, ఆయన కుమారుడు శ్రీనివాసులును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

News August 18, 2024

వైభవంగా కోదండ రామస్వామి తెప్పోత్సవాలు

image

కార్వేటినగరంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు ఉదయమే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. సీతా సమేత రామ, లక్ష్మణ, హనుమంత స్వామి వారిని వాహనంపై కొలువు దీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామివారిని తెప్పలపై కొలువుదీర్చి పుష్కరణిలో విహరింపజేశారు. అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు.