India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని గిరిజన నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. బీఈడీ, డీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన ఎరుకల, సుగాలి, యానాది గిరిజన కులాలకు చెందిన వారు ఈనెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
ఆడుదాం ఆంధ్రా పేరిట భారీ అవినీతి జరిగిందని కొందరు సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ని సీఐడీ ఆదేశించింది. గత ప్రభుత్వంలో క్రీడా శాఖా మంత్రిగా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పని చేశారు. అప్పట్లో క్రీడా పోటీలకు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. నాసిరకమైన క్రీడా పరికరాలు కొనుగోలు చేసి రూ.కోట్లలో అవినీతి చేశారని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి.
‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా బృందం తిరుపతిలో గురువారం సందడి చేసింది. గ్రూప్ థియేటర్‌కు చేరుకున్న సినిమా నిర్మాత నిహారిక, మూవీ సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. వారాంతంతో పాటు సాధారణ రోజుల్లోనూ ఇంత రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని నిహారిక అన్నారు. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
శ్రావణ మాసం, అందులోనూ రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రాకతో పూల ధరలు అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణమాసం ముందు వారం అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా రెండు నుంచి మూడింతలు పెరిగాయి. బంతిపూలు కిలో ధర రూ.10 నుంచి రూ.50కి చేరింది. 300 ఉన్న మల్లెపూలు రూ.1000 చేరాయి. కనకాంబరాలు 600 నుండి ప్రస్తుతం రూ.2000 చేరింది అయితే ఇది హోల్‌సేల్ ధరలు మాత్రమే. రిటైల్‌కు వచ్చే సరికి పూల ధర రెట్టింపు అవుతాయి.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘావర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది ఇవాళ మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
చిత్తూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి, వైద్య ఆరోగ్య శాఖకు రెండు, విద్యా శాఖకు మూడో బహుమతిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు.
చిత్తూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో తిరిగి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఎస్పీ మణికంఠ పాల్గొన్నారు.
తిరుపతి నగరంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి క్యాంప్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండాకు గౌరవ వందనం చేశారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందని ఆయన చెప్పారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.