India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో MCA (CBCS) 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బైక్‌లను ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఎక్కువగా ఉంటుందన్నారు. తిరుమలకు బైక్‌ల్లో వచ్చే వారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం తమిళనాడులో జరిగింది. యగేశ్(21), చేతన్(23) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నారు. వారు స్నేహితులతో అరుణాచలేశ్వర ఆలయానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. దీంతో యగేశ్, చేతన్‌తో పాటు ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాట్ వద్ద ఓ చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారులు గమనించి టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టాలని వారు కోరారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నేడు మంత్రి గొట్టిపాటి, అనగాని సత్యప్రసాద్ హైదరాబాదు నుంచి రేణిగుంటకు వచ్చారు. ఈ మేరకు వారికి పలువురు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. మంత్రులు రేపు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
కలకడలోని రాజీవ్ నగర్‌కు చెందిన షేక్ నవాజ్ కడపకు చెందిన నౌషీన్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి చిన్నపాటి ఘర్షణలతో నౌషిన్ తన అన్న షాలూర్‌ను పిలిపించింది. దీంతో ఆదివారం మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో నవాజ్‌ను షాలూర్ కత్తితో పొడిచాడు. క్షతగాత్రుడిని పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు.
తవణంపల్లి మండలంలో ఆదివారం విషాదం నెలకొంది. పట్నం బ్రిడ్జి వద్ద ఓ బైక్‌ను లారీ ఢీకొట్టడంతో చంద్రమ్మ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ పేరు చెప్పగానే చోరీ అయిన 40 గ్రాముల బంగారు రూ.25 వేల నగదును ఇంటి వద్ద పడేసి వెళ్లారని కర్ణాటకకు చెందిన బాలసుబ్రహ్మణ్యం తెలిపాడు. ఈనెల 2న చోరీ జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు. పెద్దమనుషుల సూచనల మేరకు ఇంటికొకరు రాజనాల బండకు రావాలని తీర్మానించారు. దీంతో భయపడిన దొంగలు పడేసి వెళ్లారు.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. చిత్తపార అటవీ ప్రాంతంలో 19 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. అయితే వీటిని వన్యప్రాణుల వేటకోసం తయారుచేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.