EastGodavari

News June 28, 2024

ఫోన్ తీశాడని ఆరోపణలు.. గడ్డి మందు తాగిన బీటెక్ స్టూడెంట్

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బీటెక్ విద్యార్థి గడ్డి మందు తాగాడు. SI పవన్ వివరాల ప్రకారం.. శివగంగాధర్ అనే యువకుడు చేబ్రోలులోని కాలేజ్‌లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్‌లో ఫోన్ పోగా.. శివ తీశాడని ఆరోపిస్తూ ఇంటికి పంపేశారు. అలాగే ఎస్సైనంటూ సీనియర్లు శివను కొట్టారని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని అతడి మామ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 28, 2024

రాజమండ్రి: నా సర్వీస్‌లో మరుపురాని ఘట్టం: IAS మాధవీలత

image

తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన రెండేళ్ల రెండు నెలల కాలం తన సర్వీస్‌లో మరుపురాని ఘట్టం అని IAS డా.మాధవీలత అన్నారు. జిల్లా నుంచి రిలీవ్ అయిన ఆమెకు గురువారం స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అధికారులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, జేసీ తేజ్ భరత్, సబ్‌కలెక్ట ర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

News June 27, 2024

మామిడికుదురు: దుర్ఘటనకు 10 ఏళ్లు..22 మంది అగ్నికి ఆహుతి 

image

మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపు లైన్ విస్ఫోటనం జరిగి పదేళ్లు కావస్తున్నా నాటి భయానక వాతావరణం నగరం దీవి వాసులను కలవర పెడుతోంది. 2014 జూన్ 27వ తేదీన గెయిల్ ట్రంక్ పైప్ లైన్ పేలుడు జరిగి 22 మంది మృత్యువాత పడగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు గృహాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. 

News June 27, 2024

రావులపాలెం: కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా ప్రమోషన్

image

రావులపాలెం పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్  వైకుంఠరావుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన 34 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకోగా ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జేమ్స్ రత్నప్రసాద్, ఇతర సిబ్బంది వైకుంఠరావును అభినందించారు. ఇప్పటివరకు ఆయన సర్వీసులో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేశారని కొనియాడారు.

News June 27, 2024

తూ.గో: రవాణా శాఖకు రూ.275 కోట్లు ఆదాయం

image

తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పన్నులు, ఫీజులు, అపరాధ రుసుముల రూపేనా గత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.275 కోట్ల ఆదాయం వచ్చింది. వాహన జీవిత కాల పన్నులుగా రూ.113 కోట్లు, క్వార్టర్లీ పన్నులుగా రూ.35 కోట్లు, ఫీజుల రూపేనా రూ.11 కోట్లు, సర్వీస్ ఛార్జీలుగా రూ.27 కోట్లు, వాహన తనిఖీల ద్వారా అపరాధ రుసుము రూపేన రూ.89 కోట్లు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

News June 27, 2024

యు.కొత్తపల్లిలో 80 కిలోల చేప

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలోని ఉప్పాడ చేపల రేవులో ఓ వ్యక్తికి 5 అడుగుల పొడవు ఉన్న 80 కిలోల చేప వలలో చిక్కింది. ఇది నల్లమట్ట జాతికి చెందిన చేప అని ..ఇవి చాలా అరుదుగా లభిస్తాయని అన్నారు. దీనికి వేలం నిర్వహించగా ఓ వ్యాపారి రూ.7 వేలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు.

News June 27, 2024

వర్షాలకు ఛాన్స్.. పాపికొండలకు బోట్ యాత్ర నిలిపివేత

image

దేవీపట్నం మండలం గోదావరిలో పాపికొండల బోట్ విహార యాత్రను భారీ వర్షం కారణంగా బుధవారం నుంచి నిలిపివేస్తున్నామని టూరిజం అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ ప్రకటించడంతో సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు బోట్ యాత్ర ఉండదని పర్యాటకులు గమనించాలని కోరారు.

News June 26, 2024

కాకినాడ: బావిలో యువకుడి మృతదేహం

image

కాకినాడ జిల్లా తుని మండలం RSపేటలోని ఓ బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు బీహార్‌కు చెందిన ఉత్తమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బేకరీలో కుక్‌గా పని చేస్తున్న ఉత్తమ్.. గత 10 రోజులుగా కనబడటం లేదని బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడు బావిలో శవమై కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 26, 2024

తూ.గో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

image

ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలపై చేపట్టిన ఈ ర్యాలీని పుష్కర్ ఘాట్ వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సమాజానికి చేటు చేస్తున్న డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

News June 26, 2024

పిఠాపురం మాజీ MLA వర్మకు MLC పదవి..?

image

పిఠాపురం మాజీ MLA, టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మకు MLC పదవిపై హామీ దక్కినట్లు సమాచారం. కూటమి పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రాగా.. వర్మ ఆ సీటును త్యాగం చేశారు. అటు పవన్‌తోనూ ప్రచారంలో పాల్గొని గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పటికే MLC విషయంలో TDP అధినేత, CM చంద్రబాబు వర్మకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వర్మ సైతం ‘X’లో పోస్ట్ చేశారు.