India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా మీదుగా మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 8,10,12 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్, 9, 11 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. స్టువర్టుపేటలో ఓ బాలిక నడిచివెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆటోలో మాధవపురం డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. కాసేపయ్యాక ఆమెను ఆటోలో ఎక్కిస్తుండగా ఓ మహిళ చూసి నిలదీసింది. బాలిక బంధువులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకొన్నారు. మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా CI శ్రీనివాస్, SI మణికుమార్ కేసు నమోదుచేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఇక నుంచి విజయ నెయ్యిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్ గడువు ముగియడంతో దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఈ నెయ్యినే వినియోగించనున్నట్లు సమాచారం.
తూ.గో.జిల్లా కాపవరం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాధిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొంటారన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్‌ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.
సామర్లకోట టీటీడీసీలో 8న (మంగళవారం) ఉదయం 10.గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, సీడన్ జేడీఎం కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. వివిధ ఉద్యోగుల్లో పని చేసేందుకు పది, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.
*ఆలమూరు: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
*పిఠాపురం: బ్యాంకు ఎలక్షన్‌లో కూటమి విజయం
*జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో కోనసీమ కుర్రోడు
*కాకినాడ: అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదా.. ఒకరు మృతి
*రావులపాలెం: కోడిగుడ్ల లారీ బోల్తా
*కాకినాడ: అచ్చంపేట జంక్షన్ వద్ద యాక్సిడెంట్
*కాకినాడ నుంచి ఈ నెల 15న అరుణాచలానికి బస్సు
*రాజమండ్రి: మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
*ధవళేశ్వరం: 8 కాసుల బంగారు ఆభరణాలు చోరీ
ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.