EastGodavari

News March 26, 2026

తూ.గో: ‘కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’

image

తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గురువారం 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆమె సూచించారు.

News March 26, 2026

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

image

గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నేడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలులో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా నియోజకవర్గంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, దేవాలయాల అభివృద్ధి పనులకు తగిన గ్రాంట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.

News March 26, 2026

రాజమండ్రి : ఏప్రిల్‌లో APWJF జిల్లా మహాసభ

image

రాజమండ్రి UTF హల్‌లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఏప్రిల్ నెలలో జిల్లా మహాసభ నిర్వహణకు కార్యాచరణ, కొత్త సభ్యత్వాలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కొత్త సభ్యులను ఆహ్వానించారు. జిల్లా ఇన్‌ఛార్జి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News March 25, 2026

వేసవి ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చేకూరి

image

వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ వినియోగం, అత్యవసర సేవల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. దీనికి సంబంధించి బుధవారం వివిధ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, తాగునీటి సరఫరా విభాగం, విద్యుత్, విద్యాశాఖలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News March 25, 2026

రాజమండ్రి చేరుకున్న వి.ఎల్.కాంతారావు

image

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్.కాంతారావు బుధవారం రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతిపై కాంతారావు అధికారులతో చర్చించనున్నారు.

News March 24, 2026

కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

image

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి స్పెషల్ పిలుపు.. బాబికి కీలక పదవి

image

రాజమండ్రికి చెందిన ఏడిద బాబి Mega Youth Force జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్ కొణిదెల సుస్మిత నుంచి ఆయన నియామక పత్రం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని బాబి వెల్లడించారు. తనపై ఉంచిన నమ్మకానికి నూరు శాతం న్యాయం చేస్తానని పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News March 23, 2026

పోలీస్ PGRSకు ఫిర్యాదుల వెల్లువ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని SP డి.నరసింహ కిషోర్ నిర్వహించారు. బాధితుల నుంచి 47 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్ట పరిధిలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా SP స్పష్టం చేశారు.