India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన నల్లి శ్రీకాంత్ కుమార్ (23) బీటెక్ చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఆదివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతణ్ని రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కుమార్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్ఐ తెలిపారు.
యానాంకు చెందిన కడలి మధు, మాధవ్ చిన్నతనంలోనే నాన్న ప్రేమకు దూరమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా వారి చదువు, బాగోగులు అన్నింటినీ వాళ్ల అమ్మే చూసుకుంది. ఇద్దరు కొడుకులను బాగా చదివించింది. ఈ క్రమంలో ఇద్దరూ కానిస్టేబుళ్లు అయ్యారు. ఇటీవల పుదుచ్చేరి పోలీస్ శాఖ ప్రకటించిన పదోన్నతులలో ఏఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్సై యూనిఫాంలో ఇంటికి వచ్చి వారి అమ్మకు సెల్యూట్ చేస్తూ పొంగిపోయారు.
– GREAT కదా.
TDP- జనసేన- BJP పొత్తులో భాగంగా APలో జనసేన 21 స్థానాల్లో పోటీచేయనుంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన వారిలో 9మంది ఉభయగోదారి జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. మరో 2 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందని టాక్. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం తూ.గో. జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. మొత్తం సీట్లలో 50 శాతం అభ్యర్థులను మన గోదారి జిల్లాల నుంచే బరిలో నిలిపారు. మరి జనసేనను గోదారోళ్లు ఆదరించేనా..?
– మీ కామెంట్..?
గొల్లప్రోలు మండలం చందుర్తిలో నిర్వహించిన బీసీ, ఎస్సీల అవగాహన సదస్సులో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన- బీజీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజవర్గ అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
అమలాపురం అల్లర్లపై కేసులు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. దళిత నాయకులు జంగా బాబురావుతో పాటు మరో ఆరుగురు నేతలు వేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2022లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయమై గొడవలు జరిగాయి. అప్పట్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తూ.గో జిల్లా రాజానగరం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోనగూడెం ISTS ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో బైక్‌ను ఓ భారీ వాహనం ఢీకొంది. భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్య లోవకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతదేహంపై పడి భర్త కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. రాజమండ్రిలో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కిర్లంపూడిలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు <<12873564>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వెంకటేశ్ (20), హరిసాయి వెంకట్ (20) సామర్లకోటకు పనినిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాజుపాలెం శివారులో బొలెరో వాహనం ఢీకొనగా చనిపోయారు. తండ్రి గతంలో చనిపోగా వెంకటేశ్ చిన్న ఉద్యోగం చేస్తూ సోదరి, తల్లిని పోషిస్తూ వస్తున్నాడు. హరిసాయి ఇంటర్ చదవగా ఉద్యోగప్రయత్నంలో ఉన్నాడు.
ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచికి చెందిన పవన్‌కళ్యాణ్ అభిమాని తాడి గంగాధర్ నవీన్ (30), రాజేశ్, సురేశ్, వెల్దుర్తికి చెందిన సత్యనారాయణ, ఉమాశంకర్ 2 బైక్‌లపై ప్రత్తిపాడుకు వెళ్తుండగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ఘటనలో నవీన్ చనిపోగా..మిగతావారికి గాయాలయ్యాయి. నవీన్ తల్లిదండ్రులతో HYDలో ఉండగా ఆదాయం సరిపోవట్లేదని భార్య, పిల్లలతో 2నెలల క్రితమే ఉత్తరకంచికి వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు.
తూ.గో జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో APPSC గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎన్.తేజ్ భరత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 8,258 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కి ఉదయం 5,056 (61.23 %) మంది హాజరయ్యారని, 3,202 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పేపర్-2కి మధ్యాహ్నం
5,007 (60.63 %) మంది హాజరు కాగా.. 3, 251 మంది గైర్హాజరయ్యారన్నారు.
Sorry, no posts matched your criteria.