News March 18, 2024

తూ.గో జిల్లాలో విషాదం.. యాక్సిడెంట్‌లో మహిళ మృతి

image

తూ.గో జిల్లా రాజానగరం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోనగూడెం ISTS ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో బైక్‌ను ఓ భారీ వాహనం ఢీకొంది. భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్య లోవకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతదేహంపై పడి భర్త కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. రాజమండ్రిలో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Similar News

News October 16, 2024

కొత్తపేటలో ప్రేమ పేరిట బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

image

కొత్తపేట మండలంలోని అవిడి పెదపేటకు చెందిన కృష్ణబాబు (22) కి 15 రోజులు రిమాండ్ విధించినట్లు DSP వై. గోవిందరావు తెలిపారు. వారి కథనం.. ఓ బాలిక(17)ను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడు. విషయాన్ని బాలిక కుటుంబీకులకు చెప్పడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. DSP విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.

News October 16, 2024

కూనవరం అటవీక్షేత్రంలో పెద్దపులి జాడలు

image

కూనవరం అటవీ క్షేత్ర పరిధిలోని దూగుట్ట, చింతూరు మండలం ఏడుగురాళ్ల పంచాయతీ పరిధిలోని తాటిలంక గ్రామ సమీపంలో పెద్దపులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు మంగళవారం గుర్తించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పశువులు ప్రమాదానికి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చింతూరు DFO బబిత పరిస్థితిని అటవీ అధికారులతో సమీక్షస్తున్నారు.

News October 16, 2024

సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తా: మంత్రి సుభాశ్

image

తనపై నమ్మకం ఉంచి కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, మంత్రి లోకేశ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనపై పెట్టిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.