India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు డాక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆసుపత్రిలో ఆకస్మీకంగా తనిఖీలు చేపట్టారు. విధుల నిర్వహణలో బాధ్యతరహిత్యంగా వ్యవహరించడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విచారణ అనంతరం ఐదుగురి డాక్టర్లను, నలుగురి సిబ్బందిని సస్పెండ్ చేశారు.
జగన్ దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కే.ఎస్ జవహర్ అన్నారు. మంగళవారం కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దళిత బాధితులను పరామర్శించడానికి రాని జగన్ ఇప్పుడు, నేరస్థుడుకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. దళిత యువకుడిని బాధించిన నేరస్థుడు వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ హేయమైన చర్య అన్నారు. జగన్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేసి నేటికీ 11 సంవత్సరాలకుగాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో విభజన చట్టంపై చర్చించేందుకు కేంద్రానికి నోటీసు ఇచ్చేలా చూడాలని ఉండవల్లి కోరారు.
రోడ్డు ప్రమాదంలో కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. భార్య కుమారితో కలిసి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైకుపై తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బైకుపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.
బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులకు గురి చేసిన నలుగురు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. సీఐ వివరాల మేరకు.. బొమ్మూరుకు చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె బంధువులు యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వేధించారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఎన్టీఆర్, ఘంటసాల వంటి సినీ ప్రముఖులను వెండితెరకు పరిచయం చేసిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం హైదరాబాద్‌లో మరణించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం గ్రామంలో 1924లో జన్మించారు. మహిళలు బయటకు రాని కాలంలో భర్తతో కలిసి 1936 శోభనాచలం స్టూడియోను స్థాపించి ‘సతీ అనుసూయ’ చిత్రాన్ని నిర్మించారు. 1948లో మనదేశం సినిమాతో ఎన్టీఆర్‌ను తొలిసారి వెండితెరకు పరిచయం చేశారు.
విద్యార్థులకు పదో తరగతి కీలకమైనది. పదో తరగతి పరీక్షలకు 28 రోజులే ఉన్నాయని డీఈవో వాసుదేవరావు అన్నారు. రాజమండ్రిలో ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పది విద్యార్థుల ప్రత్యేక తరగతులను ఆదివారం పరిశీలించారు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. త్వరగా నిద్ర పోవడం తెల్లవారు జామున లేచి సాధన చేయడంతో ఎక్కువ గుర్తు పెట్టుకోవచ్చన్నారు.
తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్నరాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని కోరారు.
తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్న రాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందోని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని రైతులను కోరారు.
Sorry, no posts matched your criteria.