India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
85 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజమండ్రి 8వ న్యాయస్థానం, క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. కరప మండలం వేలంగికి చెందిన వెంకటరమణ గతేడాది ఫిబ్రవరి 7న రాయవరానికి చెందిన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా శిక్ష విధించారన్నారు.
పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ బులెటిన్ విడుదల చేశారు. పార్లమెంట్ రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీ సభ్యులుగా ఎంపీ టి. ఉదయ్ శ్రీనివాస్(జనసేన) నియామకం అయ్యారు. ఇదే కమిటీలో వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి తూ.గో.జిల్లాలో వివిధ హోదాల్లో పార్టీ నాయకులను నియమిస్తూ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, కోనసీమ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్‌ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్ రామ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో కాకినాడ, కోనసీమ జిల్లాల వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. మాజీ మంత్రి తోట నరసింహం, ముద్రగడ పద్మనాభ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, రాజా, ధనలక్ష్మి, కన్నబాబు, దొరబాబు, మాజీ ఎంపీ వంగా గీత ఉన్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ త్రిమూర్తులు, మాజీ మంత్రులు విశ్వరూప్, సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ, జగ్గిరెడ్డి, సూర్య ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
తూ.గో జిల్లాలోని పురాతన ఆలయాలు పర్యాటక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని పొలాలు, నదులు చూపరులను కట్టి పడేస్తాయ్. ముఖ్యంగా ఈ జిల్లాలో మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతాన్ని చూసేందుకు ఇతర ప్రాంత వాసులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.
కడియపులంకలో చిరుత సంచారం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. చిరుతను బంధించేందుకు వారు రేయిపగలు శ్రమిస్తున్నారు.లంకల వైపు వెళ్లిన చిరుత బుధవారం పడ్డ వర్షానికి తిరిగి వెనక్కి కడియపులంకకు వచ్చేసినట్లు పాదముద్రల ఆధారంగా డీఎఫ్‌వోలు తెలిపారు. దానికోసం 60 మంది సిబ్బంది, 2బోన్లు,10 మేకలు సిద్ధంగా ఉంచామన్నారు. అయితే గురువారం గుర్తించిన మేరకు ఓ నర్సరీ షెడ్డు వద్ద కుక్కలను తరిమినట్లు గుర్తించామన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో ఉదయం నుంచి కురిసిన వర్షానికి 176.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు గురువారం రాత్రి తెలిపారు. జిల్లాలోని నల్లజర్ల మండలంలో 39.2 మిల్లీమీటర్లు అత్యధిక వర్షం కురిసింది అని తెలిపారు. గోపాలపురంలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. రాజానగరంలో 27.4 అనపర్తిలో 23.4 రాజవరంలో 11.8 మిల్లీమీటర్ల ఉంచిన వర్షం కురిసిందని తెలిపారు.
ఏలూరు ఆశ్రం వైద్య విద్యార్థులు ఏజెన్సీలోని జలపాతం వద్ద నాలుగు రోజుల కింద గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి హరదీప్ ఆచూకీ ఇప్పటికి తెలియరాలేదు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారుల సమక్షంలో గురువారం డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఏజెన్సీని జల్లెడపట్టారు. అయినా హరదీప్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనలో ఉన్నారు.
మద్యం మత్తులో పెంచుకున్న బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో కె.గంగవరానికి చెందిన నిందితుడిని రెండేళ్లకు అరెస్ట్ చేశామని పామర్రు ఎస్.ఐ జానీ బాషా బుధవారం తెలిపారు. బాలిక గర్భవతి కావడంతో అబార్షన్ చేయించేందుకు 2022 సెప్టెంబర్ లో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడన్నారు. అప్పట్లో వైద్యుల ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో దొరికాడన్నారు.
YS జగన్ తిరుమల పర్యటనపై BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘28న తిరుమలకు వెళ్తున్న జగన్ TTD అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. జగన్ అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నం.311, రెవిన్యూ, ఎండోమెంట్స్ రూల్ నం.16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.