India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారి టి.శ్రీదేవి సోమవారం తెలిపారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గృహహింస, ఇతర అన్యాయాలకు గురయ్యే మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100 నంబరును సంప్రదించాలని సూచించారు. అధికారులు విధిగా హాజరై అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

చాగల్లు ప్రధాన కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. కుమారదేవానికి చెందిన పంది వీర్రాజు, నాగలక్ష్మి(52) దంపతులు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎదురుగా వచ్చిన లారీ వారి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ లో జరుగుతున్న మైత్రి యువజనోత్సవాలలో శుక్రవారం రాత్రి నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి పాటలు పాడి డాన్స్ చేశారు. తాను దంతవైద్యం చదివి నటినయ్యానని.. విద్యార్థుల ఆనందం చూస్తుంటే తన చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మీనాక్షిని చాన్స్‌లర్ చైతన్య రాజు సత్కరించారు. భవిష్యత్తులో మీలోనే ఎందరో నటీనటులు రావచ్చని ఆమె ఆకాంక్షించారు.

టెన్త్ పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్ధం వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా హాల్ టికెట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. దీని కోసం 95523 00009 నంబర్ కు “Hi” అని మెసేజ్ పంపాలన్నారు. తదుపరి అందుబాటులో వచ్చే సేవల్లో “విద్యా సేవలు” ఎంపిక చేసి “SSC Hall Ticket” పై క్లిక్ చేయాలి. తర్వాత విద్యార్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే డౌన్‌లోడ్ అవుతుందన్నారు.

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.

జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.64.07 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని డీపీటీఓ మూర్తి తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. తూ.గో జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.