EastGodavari

News March 6, 2026

టెన్త్ పరీక్షలకు 24,538 మంది విద్యార్థులు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు 138 కేంద్రాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రతిరోజూ ఉ.9.30 గంటల నుంచి మ.12.45 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 24,538 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందులో రెగ్యులర్ అభ్యర్థులు 13,322 మంది, ప్రైవేట్ అభ్యర్థులు 11,216 మంది ఉన్నారన్నారు.

News March 6, 2026

‘పోలవరం’ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం.. CMకు ఉండవల్లి బహిరంగ లేఖ

image

పోలవరం ప్రాజెక్టులోని లోపాలపై హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం గ్యాప్-2 ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వ్యత్యాసాలను చెబుతూ పూర్తిస్థాయి డిజైన్‌కు ఆమోదం లేకుండా పనులు చేయడం ప్రమాదకరమని ఉండవల్లి అన్నారు. ఆనకట్ట పునాది స్థాయిలో వ్యత్యాసం ఉండటం వల్ల స్థిరత్వం దెబ్బతింటుందని, పునాది కింద ఇసుక కోతకు గురైతే పోలవరం డేంజర్‌లో పడుతుందని హెచ్చరించారు.

News March 6, 2026

మార్చి 7న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

image

మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టీటెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 6, 2026

మార్చి 7న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

image

మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టీటెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 5, 2026

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

image

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.

News March 5, 2026

రాజమండ్రి కల్తీ పాలు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం (1:25 PM) హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 11 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు 8 మంది మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.వెంకటలక్ష్మి (69) మృతి చెందినట్లు తెలిపారు.

News March 5, 2026

రాజమండ్రి: 7, 8 తేదీల్లో జిల్లాలో ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పర్యటన

image

జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా ఈనెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన 6వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం చేరుకొని ఓఎన్‌జీసీ అతిథి గృహంలో బస చేస్తారు. 7న జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహింనున్నారు. అనంతరం ధవళేశ్వరంలో నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొని, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

News March 5, 2026

రాజమండ్రి: ఈనెల 8న జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’

image

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) ఆదేశాల మేరకు ఈ నెల 8న తూర్పుగోదావరి జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి(DSDO) డి.ఎమ్.ఎమ్. శేషగిరి తెలిపారు. హుకుంపేటలోని బొప్పన స్పోర్ట్స్ క్లబ్‌లో టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు, ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News March 5, 2026

మీరు చేసే పనులపై CM నిఘా.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

image

CM చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్పకుండా విశ్లేషణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఒక టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించాలని యంత్రాంగాన్ని కోరారు.

News March 5, 2026

తూ.గో: అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ద్వారా అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈనెల 13 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి గల జిల్లా అభ్యర్థులు Join Indian Army అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.