EastGodavari

News September 23, 2024

మారేడుమిల్లి: జలపాతంలో గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యం

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిని కె.సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది.

News September 23, 2024

పోలీసులకు దొరికిన అత్యాచార నిందితుడు?

image

తెలంగాణలో కాకినాడ జిల్లా వివాహితపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సామర్లకోటకు చెందిన వివాహిత(24) హైదరాబాద్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. ఈనెల 18న HYDలో రాజమండ్రికి వచ్చే ప్రైవేట్ బస్సు ఎక్కింది. క్లీనర్ రెడ్డి సాయికుమార్(26) చౌటుప్పల్ దాటగానే నిద్రిస్తున్న ఆమెపై అత్యాచారం చేశాడు. చౌటుప్పల్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా.. క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News September 23, 2024

తూ.గో.: జలతరంగిణి జలపాతం వద్ద గల్లంతయ్యింది వీరే

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో గల్లంతైన వారు ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులుగా గుర్తించిన విషయం తెలిసిందే. వాగులో గల్లంతైన వారిని హారదీప్, సౌమ్య, అమృతగా అధికారులు గుర్తించారు. కాగా వీరి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

News September 22, 2024

తూ.గో.: జలతరంగిణి ఘటనపై మంత్రి దుర్గేశ్ విచారం

image

మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద వాగులో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన చాలా విచారకరమని అన్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News September 22, 2024

తూ.గో.: వాగులో ఐదుగురు MBBS విద్యార్థులు గల్లంతు

image

మారేడుమిల్లి మండలం జలతరంగిణి కాలువలో పడి ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. వివరాలు.. ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో MBBS చదువుతున్న కొందరు విద్యార్థులు ఆదివారం పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు మారేడుమిల్లికి వెళ్లారు. వీరిలో ఐదుగురు గల్లంతవగా స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరిని సురక్షితంగా రక్షించినట్లు మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 22, 2024

రాజోలులో దారుణం.. కోడలిపై అఘాయిత్యం

image

ఉపాధి కోసం కొడుకు గల్ఫ్ దేశానికి వెళ్లగా అత్త వారి ఇంటి వద్ద ఉంటున్న కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాజోలు మండల పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. దీనిపై బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని రాజోలు ఎస్సై రాజేశ్ కుమార్ శనివారం తెలిపారు. గతంలో ఒకసారి అత్యాచారానికి పాల్పడ్డాడని, మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నాడని అతని నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరిందని తెలిపారు.

News September 22, 2024

సామర్లకోటకు చెందిన వివాహితపై బస్సులో అత్యాచారం

image

సామర్లకోటకు చెందిన వివాహితపై ప్రైవేటు ట్రావెల్ బస్సులో క్లీనర్ అత్యాచారానికి పాల్పడ్డాడని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ మన్మధ కుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న వివాహిత స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18వ తేదీ రాత్రి HYDలోని కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కారన్నారు. బస్సు బయలు దేరిన కొద్ది సేపటికే స్లీపర్ కోచ్‌లో క్లీనర్ అత్యాచారం చేశాడన్నారు.

News September 21, 2024

కాకినాడ: తుని మండలంలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ద్విచక్ర వాహనంపై ఓ పరీక్ష నిమిత్తం ఇద్దరు వెళ్తుండగా వారిని కారు ఢీకొట్టిందని తుని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2024

తూ.గో.: మృత్యువులోనూ ఒక్కటై

image

మృత్యువులోనూ ఆ దంపతులు బంధం వీడలేదు. ఇద్దరు ఒకేసారి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెంలో శనివారం జరిగింది. భార్య, భర్త ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలిశెట్టి అధిచంద్రరావు (68) అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. విషయం తెలిసిన ఆయన భార్య పోలిశెట్టి నాగవేణి(58) తీవ్ర మనస్తాపానికి గురై గంటల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

News September 21, 2024

తూ.గో మీదుగా నడిచే రైళ్లు రద్దు

image

ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం తెలిపింది. కడియం-కొవ్వూరు స్టేషన్ల మధ్య పనులతో ఈ నెల 29న తిరుపతి-విశాఖ, 30న విశాఖ-తిరుపతి, విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ, విశాఖ-గుంటూరు, గుంటూరు-విశాఖ, 29, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ, విజయవాడ-రాజమండ్రి, అక్టోబర్ 1న విశాఖ-గుంటూరు, 30న విజయవాడ-రాజమండ్రి, రాజమండ్రి విశాఖ, విశాఖ-రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.