India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అదనపు కట్నం కోసం భార్యని వేధించడంతో పాటు ఆమెపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఏలూరుకు చెందిన సంస్కృతం లెక్చరర్ రాజేశ్వరరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ పిఠాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బాబు శుక్రవారం తీర్పు చెప్పారు. తొండంగి మండలం బెండపూడికి చెందిన జువాలజీ లెక్చరర్ మధురాక్షిపై ఆమె భర్త 2020 సెప్టెంబర్ 10న తునిలో కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడు.
ఈ నెల 23వ తేదీన కాకినాడ వికాస కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో ఐఅండ్‌వీ బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ జాబ్‌మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు.
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట తనయుడు ముద్రగడ గిరిబాబు, కిర్లంపూడి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు తదితరులు ఉన్నారు.
మంత్రి కందుల దుర్గేష్ శనివారం కాకినాడలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు కాకినాడ టూరిజం డిపార్ట్‌మెంట్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడలో టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్స్‌పెక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని ప్రజల ఫోన్లకు సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు వచ్చాయి. కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి, రంపచోడవరం, కోనసీమ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజోలు మండలం కూనవరం గ్రామంలో గురువారం రాత్రి 54 కిలోల వినాయకుడి లడ్డూ వేలం వేశారు. ఇందులో భక్తులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఆ లడ్డూను స్థానిక భక్తుడు పిల్లి రామకృష్ణ రూ.73 వేలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను ఊరేగింపుగా తీసుకు వెళ్లి భక్తులకు ప్రసాదంగా పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
గోకవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు బాలికలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై విఎన్వీ పవన్ కమార్ తెలిపారు. వారిది ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరిగా గుర్తించి, వారివద్ద నుంచి సుమారు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న బాలికలను జువనైల్ హోంకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,53,400 ఉంటుందన్నారు.
చిరుత పులిని పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తూ.గో. జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గురువారం తెలిపారు. గత రాత్రి శ్రీరాంపురం, పాలమూరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమన్నారు. నిపుణుల బృందం పాదముద్రలు పరిశీలించగా అవి అడవి పిల్లి పాద ముద్రలుగా నిర్ధారణ జరిగిందన్నారు. ట్రాప్ కెమెరాలో అడవి పిల్లిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. https://www.bse.ap.gov.in ఆసక్తి గల విద్యార్థులందరూ ఈ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మీ ఎమ్మెల్యే పనితీరుపై కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.