India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుద్దగడ్డ వాగు సమస్యకు స్థానిక MLAగా పూర్తిస్థాయి పరిష్కారం చూపుతానని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. గొల్లప్రోలులో సోమవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నది, వాగు పరీవాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అనారోగ్యంతో ఉన్న ప్రజల బాధలు చూసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, వాటిని ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఉదయం 11:30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.
కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ షాన్ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ప్రాంతాల్లోని అంగన్ వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని సూచించారు. వరద, భారీ వర్షాలు లేని మిగతా ప్రాంతాల్లో మంగళవారం యథావిధిగా పాఠశాలలు నిర్వహించాలన్నారు.
ఏలేరు జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహం ఈ రాత్రికి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సూచించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23.23 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. పై నుంచి 46,405 క్యూసెక్కుల నీరు రాగా.. 25,275 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దివాన్ చెరువు ప్రాంతంలో సోమవారం చిరుత పులి పాదముద్రలను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి ఓ ప్రకటనలో తెలిపారు. చిరుత అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు ట్రాప్ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయన్నారు. చిరుత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దాన్ని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామని, చిరుత సంచారాన్ని బట్టి ట్రాప్ కెమెరాలను మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజమండ్రి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోసం గ్రామీణ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సెల్ ఫోన్ రిపేర్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెక్యూరిటీ కెమెరా ఏర్పాట్లు సర్వీస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని శాటిలైట్ సిటీ గ్రామంలోని స్థానిక రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్స్ 11వ వీధిలో అర్ధరాత్రి చిరుత సంచరిస్తుందనే వార్త నిజం కాదని అటవీ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఫొటో ఎడిట్ చేశారని వివరించారు. ఆకతాయి పనులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సెలవును జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అమలు చేయాలని ఆమె సూచించారు. మరోవైపు కాకినాడ జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతి నెమ్మదిస్తోంది. ఆదివారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులకు చేరింది. సాగునీటి అవసరాల నిమిత్తం 3,300 క్యూసెక్కులు వాడుకొని మిగిలిన 5,21,407 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నామని అధికారులు తెలిపారు.
కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక తూ.గో. జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ సూచన ఉందన్నారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ పోర్టుకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.