India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో. జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు <<14036102>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్, పల్నాడు జిల్లాకు చెందిన కార్తిక్ రాజమండ్రిలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. సెమిస్టర్ పరీక్షలకు చదువుకునేందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గుండెలో నొప్పిరావడంతో అందరూ కలిసి రాజమండ్రిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరగా యాక్సిడెంట్ జరిగింది.
కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 11వ తేదీన ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల వర్మ తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రభుత్వ & ప్రైవేట్ ఐటీఐ పూర్తి చేసి NTC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని అన్నారు. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు వచ్చి తమకు కావలసిన అప్రెంటిస్లను ఎంపిక చేసుకుంటారన్నారు.
రాజమండ్రి అటవీప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతంవైపు శుక్రవారం వేకువజామున చిరుత ఓ జంతువును నోటకరిచి రోడ్డు దాటింది. దీనిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిడంతో వారు పాదముద్రలు సేకరించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పర్యావరణహితంగా వినాయక చవితి చేపట్టాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 2 నెలల క్రితం ప్రత్యేకంగా మట్టివిగ్రహాల తయారీపై పలువురికి శిక్షణ ఇప్పించారు. కాగా 2 నెలల్లో 5 అడుగుల మట్టి వినాయక ప్రతిమలు 50, మూడు అడుగులవి 80 తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి రాష్ట్రమంతటా విగ్రహాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు.
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ భారీ వినాయకుడి విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దేది కాజులూరు మండలం గొల్లపాలెంకి చెందిన ‘సత్యఆర్ట్స్’ సభ్యులే. 20 ఏళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడికి రంగులు వేసే పనిని వీరే చూస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాగణపతి అవతారంలో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సత్యఆర్ట్స్ బృందం 15 రోజులు శ్రమించి రంగులు దిద్ది పని పూర్తిచేశారు.
కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్ర భీమేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 7 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడో తేదీన ఉదయం 8:30 గంటలకు మహాగణపతి స్వామికి ప్రత్యేక హోమ పూజలు, కలశ పూజలు నిర్వహిస్తామని అన్నారు. స్వామి వారి గ్రామోత్సవం, తదితర ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈవో నీలకంఠం కోరారు.
మామిడికుదురు మండలం నగరంలో నివాసముంటున్న రేణుక ఫిర్యాదు మేరకు ఆమె భర్త భానుప్రసాద్, మామ సత్యనారాయణ, అత్త మణికుమార్‌తో పాటు మరో ఏడుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని ఎస్సై చైతన్యకుమార్ శుక్రవారం తెలిపారు. పి.గన్నవరం మండలం నాగుల్లంకకు చెందిన రేణుకకు, అదే గ్రామానికి చెందిన భానుప్రసాద్‌తో 2021లో ప్రేమ వివాహం జరిగిందన్నారు. వివాహం ఇష్టం లేని అత్త, మామ భర్తతో కలిసి వేధిస్తున్నట్లు తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మెర్ల సత్తయ్య(53) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన సత్తయ్య రోజూ తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. కోపంతో గురువారం పురుగు మందు తాగిన సత్తయ్య.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై తెలుపారు.
తూ.గో జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి శరీరం నుంచి చేయి తెగిపోయి దూరంగా పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజమండ్రిలోని దివాన్ చెరువు వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన కార్తీక్ (19)గా గుర్తించారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.