EastGodavari

News September 5, 2024

RCPM: గోరుపై రాధాకృష్ణన్ చిత్రం గీసిన కళాకారుడు

image

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని నరసాపురపుపేట ఉపాధ్యాయులు రాయుడు త్రినాథ్ ప్రసాద్ తన చేతి బొటనవేలు గోరుపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని తన కళానైపుణ్యంతో వేసి పలువురిని అబ్బురపరిచారు. ఆయనపై ఉన్న అభిమానంతో ఈ చిత్రలేఖనం వేశానని ఉపాధ్యాయుడు త్రినాథ్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.

News September 4, 2024

కాకినాడ: సురక్షితంగా తీరానికి చేరిన మత్స్యకారులు

image

తుఫాను కారణంగా బంగాళాఖాతం సముద్రంలో చిక్కుకున్న చెన్నై ఫిషింగ్ బోట్‌తో పాటు అందులోని 10 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం బుధవారం రక్షించింది. ఆగస్టు 23న బయలుదేరిన మత్స్యకారులు సాంకేతిక కారణంతో తుఫానులో చిక్కుకున్నారు. సముద్ర తీరం నుంచి 100 నాటికన్ మైళ్ల వద్ద గుర్తించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు అధికారులు పంపిన టగ్ ద్వారా కాకినాడ కస్టమ్స్ జెట్టీకి సురక్షితంగా తీసుకువచ్చినట్లు తెలిపారు.

News September 4, 2024

మండపేట: వరద బాధితులకు BSR రూ.కోటి సాయం

image

మండపేట మండలం ఏడిదకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బలుసు శ్రీనివాస్ రావు BSR వరద బాధితులను ఆదుకునేందుకు తమ సంస్థ తరపున రూ.కోటి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వరద బాధితులకు బి.ఎస్.ఆర్ ఇన్ ఫ్రా టెక్ తరపున అధినేత BSR కోటి రూపాయల విరాళాన్ని బుధవారం ఏపీ సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

News September 4, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సామర్లకోట టీచర్లు

image

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సామర్లకోట మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య బుధవారం తెలిపారు. వేట్లపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కోరా బలరాంబాబు చౌదరి, కాపవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అద్దంకి వెంకన్నబాబు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు చెప్పారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా పురస్కారం అందిస్తామని విద్యాశాఖ అధికారి పుల్లయ్య వెల్లడించారు.

News September 4, 2024

ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలి: డిప్యూటీ సీఎం

image

పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీ ఇప్పటికే ముంపులో ఉన్నందున స్థానికులకు నిత్యావసరాలు అందించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలని సూచించారు.

News September 4, 2024

తూర్పుగోదావరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జిల్లాలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలను తెరవద్దని ఆయన సూచించారు.

News September 4, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి 2,99,854 క్యూసెక్కుల జలాలు

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి బ్యారేజీ నుంచి 2,99,854 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.

News September 4, 2024

తూ.గో.: ఈ నెల 10 నుంచి పాఠశాలల క్రీడలు ప్రారంభం

image

తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ సంఘం ఆధ్వర్యంలో 2024- 25 విద్యా సంవత్సరంలో ఈ నెల 10- 13 వరకు మండల స్థాయి, 17- 21 వరకు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతాయని డీఎస్ఈవో వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఓ విడుదల చేశారు. అండర్-14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు క్రీడా పోటీలు జరుగుతాయన్నారు.

News September 4, 2024

కాకినాడ: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అదుపులోకి

image

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి జగనన్న కాలనీలో మంగళవారం వ్యభిచారం గృహంపై కోరంగి పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలను, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు SI సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడి చేయగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

News September 4, 2024

YCP తూ.గో జిల్లా అధ్యక్షుడిగా గోపాలకృష్ణ

image

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ను నియమిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.