India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసామన్నారు. 1,52,298 మందికి వైద్య సేవలు అందించామన్నారు. 46,483 గృహాలకు సేవలందించామన్నారు. సురక్షిత ప్రసవం కోసం ఆరుగురిని ఆసుపత్రికి తరలించామన్నారు. 144 మలేరియా పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
పిఠాపురం బైపాస్ రోడ్డులో పాదగయ జంక్షన్ సమీపంలో కొర్రా సత్యనారాయణపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. చిట్‌ఫండ్ వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగుడు తనను కత్తితో పొడిచి రూ.1.50 లక్షల నగదు బ్యాగుతో పరారయ్యాడని సత్యనారాయణ తెలిపాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 3.40 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.60 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.
నిరాశ్రయులైన వరద బాధితులకు సహాయం అందించాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛందంగా సహాయం చేయదలచిన వారు కాకినాడ కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారికి నగదు రూపంలో కానీ, చెక్కు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ సహాయం అందజేయవచ్చునని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
విపత్తుల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తిస్తూ మండలాల వారీగా మ్యాపులను తయారు చేయాలని అధికారులను అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ, విద్యుత్ అధికారుల తో వరదలు తుఫానులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ .మహేష్ కుమార్ మాట్లాడుతూ.. సిబ్బందికి వరదలు, తుఫానులపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
భారీ వర్షాలు.. వరదల కారణంగా రైల్వే శాఖ 31 రైళ్లను రద్దు చేసి, మరో 13 రైళ్ల రూట్ మార్చినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైళ్ల రద్దు విషయాన్ని ప్రయాణికులు గమనించి, తమ తమ ప్రయాణాల ప్రణాళికలను మార్చుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని శృంగవరంలో డయేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 15 మంది రోగులు అతిసారం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే అతిసారం ప్రబలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి సర్వే చేపట్టి, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గోదావరి జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆదివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం సాయంత్రం డెల్టా కాలువలకు మొత్తం 3,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ నుంచి 4,82,213 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
ఎస్ఎం వీటీ బెంగళూరు- కాకినాడ టౌన్ రైలు (నం.17209)ను ఈ నెల 4వన రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రైలు రద్దుచేశామన్నారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 8977935609(తూ.గో), 08856-293104(కోనసీమ), 18004253077(కాకినాడ).
Sorry, no posts matched your criteria.