India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి పేరుతో నమ్మించి బాలికను గర్భవతిని చేసిన ఘటన చోటుచేసుకుంది. లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందక కాశి(22) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను పెళ్లి పేరుతో నమ్మించి గర్భం చేశాడని ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై రౌతులపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆ యువకుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 15వ తేదీ ఈ-పంట నమోదుకు చివరి తేదీ అని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆమె మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60% ఈ-క్రాప్ నమోదు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో నలుగురు చిన్నారులు జ్వరాలతో మృతి చెందారు. కేవలం నెల రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిసర గ్రామాల్లో పూర్తిస్థాయిలో జ్వర సర్వే చేపట్టాలని, శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని కోరుతున్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొండయ్యపాలెంకు చెందిన రిటైర్డ్ SI మోర్త అప్పారావు మృతి చెందారు. అప్పారావు ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి యానాం వైపునకు వెళ్తుండగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కోరంగి పోలీసులు ఘటనాస్థలి చేరుకొని వివరాలు సేకరించారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేరు వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం మృతి చెందారు. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన దొరబాబు (40), పెదపూడి మండలం కాండ్రేగులకు చెందిన శ్రీనివాస్ (47), సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన త్రిమూర్తులు (38) ముగ్గురు వివిధ కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీలు తమ బదిలీ దరఖాస్తులను మంగళవారం లోపు సమర్పించాలని కాకినాడ జిల్లా డీఏం అండ్ హెచ్ఓ నరసింహనాయక్ తెలిపారు. దరఖాస్తులను http://gramawardsachivalayam.ap.gov.in/gswslms/login సైట్లో ఆన్లైన్లో సమర్పించాలని తెలిపారు. అలాగే హార్డ్ కాపీలు కాకినాడలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందించాలన్నారు.
కొబ్బరి పీచు బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆదివారం మామిడికుదురు మండలం పాశర్లపూడిలోని కొబ్బరి పీచు బొమ్మల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. పీచు బొమ్మలు పర్యావరణానికి అనుకూలమైనవని పేర్కొన్నారు. బొమ్మల తయారీతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందన్నారు. బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని కార్మికులకు భరోసా ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధికంగా వర్షపాతం నమోదైన వాతావరణ శాఖ అధికారులు ఆదివారం మధ్యాహ్నం మీడియాకు తెలిపారు. ఈ మేరకు గోకవరం మండలంలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలో 0.6 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదయింది అని తెలిపారు. జిల్లాలో సగటున 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల స్విమ్మింగ్ పోటీలు పెద్దాపురం శ్రీ ప్రకాశ్ సినర్జీ స్కూల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ కార్యదర్శి ఇరుసుమళ్ల రాజు తెలిపారు. శ్రీ ప్రకాశ్ సినర్జీ స్కూల్ ప్రశాంతి, చీఫ్ అడ్వైజర్ మంగా వెంకట శివరామకృష్ణ పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు రామాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. యానాం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ తాళ్లరేవు వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గాడిమొగ వాసిగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.