India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుర్తు తెలియని యువతి యానాం రాజీవ్ రివర్ బీచ్‌లోని ఎన్ఈసీ జెట్టి సమీపంలో శుక్రవారం గోదావరిలో దూకినట్లు స్థానికులు తెలిపారు. ఆమె వయసు18 – 20 ఏళ్ల మధ్య ఉంటుందని, దూకుతుండగా ఓ వ్యక్తి గమినించి అడ్డగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై మురుగానందన్ తెలిపారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి మృతుడి భార్య సాయి దుర్గకు చెక్కు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు ఫిర్యాదు నమోదుకు 1800 4252540, 0883241 7711 కు ఫోన్ చేసి తెలపాలన్నారు. జిల్లాలో పెండ్యాల, పందలపర్రు స్టాక్ యార్డ్‌ల వద్ద వినియోగదారులకు అందించేందుకు ఇసుక సిద్ధంగా ఉందన్నారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి మృత్యువాత పడిన మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకకు చెందిన ఎం.సతీష్ మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. మృతుడి భార్య నాగమణి, తల్లి పద్మావతి, తండ్రి శ్రీనివాసరావు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఉన్న దిక్కును కోల్పోయామంటూ తీవ్రంగా రోధించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రభుత్వం తరఫున సతీష్ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందించారు.
రాష్ట్రలో ఉన్న 13,226 విలేజ్‌లలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సింపుల్ గవర్నమెంట్, సింపుల్ గవర్నెన్స్ విధానంలో పనిచేసే సాదా సీదా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వమని ఉద్గాటించారు. 2014-19 స్వర్ణ యుగం, 2019-24 చీకటి యుగం అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక వరమని వానపల్లి సభా వేదికగా సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పోలవరంను దుర్మార్గుడైన జగన్ గోదావరిలో కలిపేశారని, డయాఫ్రం వాల్ నాశనమైందని, కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. తొందర్లోనే పోలవరంను పూర్తి చేస్తామన్నారు.
తూ.గో జిల్లాలో బాలికలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలో పోలీసులు వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక నంబర్ 9490760794 లేదా 112 నెంబర్ల ద్వారా 24 గంటలు వారికి అందుబాటులో ఉంటున్నామన్నారు.
భావనగర్ – కాకినాడ పోర్టు (12756) రైలును వచ్చే నెల 7, 14, 21, 28 తేదీల్లో దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లాల్సిన రైలును విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా దారి మళ్లించినట్లు వివరించారు.
అన్నవరం దేవస్థానంలో పెళ్లిసందడి నెలకొంది. స్వామి సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ముహుర్తాల్లో దాదాపు వంద వివాహాలు జరిగాయి. సత్యగిరిపై విష్ణు సదన్, ఉచిత కల్యాణ మండపాలు, రత్నగిరిపై ఆలయ ప్రాంగణాలు, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, పాత, కొత్త సెంటినరీ కాటేజీ ప్రాంగణాల్లో వివాహాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామానికి చెందిన కొప్పర్తి గణేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద పార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. సీఎం చంద్రబాబు రూ.కోటి పరిహారం ప్రకటించడంతో నిన్న అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.