EastGodavari

News February 4, 2026

పులి ఫోటోలు వైరల్ చేస్తే చర్యలు: కలెక్టర్

image

పులి ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం హెచ్చరించారు. పులి సంచారంపై సమాచారం ఉంటే అటవీ, పోలీస్ శాఖలకు తెలపాలన్నారు. పులిపై దాడి చేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 1న పశువులపై జరిగిన దాడి తర్వాత మరే ప్రమాదం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అవాస్తవాలను నమ్మవద్దని కోరారు.

News February 4, 2026

పులిని బంధిస్తాం: మంత్రి నాదెండ్ల

image

తొర్రేడు, గాడాల మీదుగా బుధవారం దివాన్ చెరువు ప్రాంతానికి పెద్దపులి సంచరిస్తోంది. పులి కదలికలను కనిపెట్టడం అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. పులిని బంధించి సురక్షితంగా అడవికి తరలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

News February 4, 2026

జైలులో అంబటికి ‘స్లీప్ అప్నియా’ పరికరం.. ఎందుకంటే!

image

రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అధికారులు ‘స్లీప్ అప్నియా’ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. శ్వాస సంబంధిత సమస్యల వల్ల నిద్రలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఉండటానికి కోర్టు అనుమతితో దీనిని సమకూర్చారు. వైద్యుల సిఫార్సు మేరకు, ఈ సౌకర్యం కల్పించామని అధికారులు చెప్పారు. సీఎంను దూషించిన కేసులో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే.

News February 4, 2026

డ్రగ్స్ రహిత జిల్లానే లక్ష్యం: SP

image

తూర్పుగోదావరి జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు సబ్ డివిజన్ల వారీగా ‘ఈగల్ టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలపై గద్దలా నిఘా ఉంచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నెట్‌వర్క్‌ను తుదముట్టించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News February 3, 2026

రాజానగరంలో మెగా జాబ్ మేళా

image

రాజానగరం ZP ఉన్నత పాఠశాలలో ఈనెల 8న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MLA బత్తుల బాలరామకృష్ణ మంగళవారం తెలిపారు. ఇందులో 60 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని 3000 మందికి ఉపాధి కల్పిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 3, 2026

పొగాకు రైతులకు శుభవార్త

image

పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్ మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుపై ఉన్న 18 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఇటీవల రాజమండ్రి MP పురందీశ్వరి రైతులతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి సుంకం ఎత్తివేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పొగాకు రైతులకు భారీ ఊరట లభించనుంది.

News February 3, 2026

తూ.గో: స్కూల్ ఆటోలపై రవాణా శాఖ కొరడా

image

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న 11 ఆటోలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అందులో 7 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి పిల్లలను తరలిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు నియమాలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 2, 2026

తూ.గో: ”పులి’ సంచారంపై అపోహాలు నమ్మవద్దు’

image

సీతానగరం మండలంలోని పెద్దకొండెపూడి, చిన్నకొండెపూడి, తొర్రేడు గ్రామాల్లో గత మూడు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. పాదముద్రల ఆధారంగా పులి వెంకటనగరం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు పులిపై వచ్చే అపోహలను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలు, ఫేక్ ఫోటోలను చూసి భయాందోళన చెందవద్దని అధికారులు కోరారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.