EastGodavari

News July 12, 2024

తూ.గో జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

image

తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి ,కోనసీమ, సామర్లకోట,ఏజెన్సీ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. పనుల కోసం అడవులలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

News July 12, 2024

రాజమండ్రి: జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు ప్రత్యేక రైళ్లు

image

ఉత్తరాఖండ్ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైళ్లు ఆగస్టు 4, 8 తేదీల్లో నడుపుతున్నామని IRCTC ఏరియా మేనేజర్ రాజా గురువారం తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో రైళ్ల వివరాల బ్రోచర్లను స్టేషన్ మేనేజర్ రంగనాథ్, సీటీఐ చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్ యాత్ర ఆగస్టు 8న విశాఖపట్నంలో బయలు దేరి రాజమహేంద్రవరం వస్తుందన్నారు. 11 రోజులు యాత్ర సాగుతుందన్నారు.

News July 12, 2024

కొత్తపేట: బాలికపై ఆగంతకుడు అత్యాచారయత్నం

image

బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థిని బుధవారం స్నేహితురాలితో మరుగుదొడ్డికి వెళ్ళింది. బాత్‌రూమ్‌లో నక్కిన ఆగంతకుడు కత్తితో బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు.దీనిపై గురువారం కొత్తపేట ఎస్సై అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 12, 2024

పెద్దాపురం మరిడమ్మ తల్లి బ్రేక్ దర్శనాలు రద్దు

image

పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో రామ్మోహన్ రావు, ధర్మకర్త బ్రహ్మాజీ తెలిపారు. గురువారం రాత్రి అమ్మవారికి మహా కుంభం నిర్వహించినందున శుక్రవారం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. శనివారం మహా సంప్రోక్షణ అనంతరం మరిడమ్మ తల్లి దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని రామ్మోహన్‌రావు తెలిపారు.

News July 11, 2024

బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఉరుకులు పరుగులు

image

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో గురువారం ఓ బాలుడు మిస్సింగ్ అయినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సదరు బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులు వెళ్లి మరోసారి ఇంట్లో వెతకగా.. ఆ బాలుడు మంచం కింద నక్కి కనిపించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News July 11, 2024

ఉప్పాడ తీరంలో అలల భయం.. అరచేతిలో ప్రాణాలు

image

ఉప్పాడ తీర ప్రాంతంలో ఎప్పుడు అలలు మింగేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఉప్పాడలో ఇప్పటివరకు 1,360 ఎకరాలు కోతకు గురయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో చెన్నైకి చెందిన NCR నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో కోత కట్టడికి 20ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేసింది. రక్షణ గోడ, గ్రోయన్ ఏర్పాటుకు రూ.200-250 కోట్ల వరకు అవుతుందని పేర్కొంది.

News July 11, 2024

మృత్యు వారధిగా మారిన చించినాడ బ్రిడ్జి

image

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు.

News July 11, 2024

నిడదవోలు: TDP, జనసేనలోకి YCP నాయకులు.?

image

నిడదవోలు నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 3ఏళ్ల కిందట పురపాలక ఎన్నికల్లో 27 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ మంత్రి అయిన విషయం తెలిసిందే.

News July 11, 2024

తూ.గో: ఏడుగురి మృతికి కారణం.. జైలు పాలు

image

తూ.గో జిల్లాకు చెందిన ఏడుగురి మృతికి కారణమైన షేక్ మహబూబ్ జానీ అనే వ్యక్తికి యావజ్జీన కారాగార శిక్ష పడింది. వీరవల్లి ఏఎస్సై వివరాల మేరకు..2014లో ప్రమాదకర రసాయనాలు ఉన్న డ్రమ్ములను హైదరాబాద్ నుంచి తణుకుకు బయలుదేరాడు. దారి మధ్యలో తూ.గో జిల్లా వాసులు ఏడుగురిని వ్యానులో ఎక్కించుకున్నాడు. రసాయనాల నుంచి మంటలు వ్యాపించడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు . దీనిపై బుధవారం నూజివీడు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

News July 11, 2024

తూ.గో.: మంత్రులు కలిసిన ‘పిల్లి’ దంపతులు

image

విజయవాడలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్‌లను బుధవారం కాకినాడ రూరల్ టీడీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ MLA పిల్లి అనంత లక్ష్మి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.