EastGodavari

News January 25, 2026

BREAKING.. రుడా పరిధిలో భూముల విలువ పెంపు

image

రుడా పరిధిలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాజమండ్రిలో ఆదివారం కలెక్టర్ మేఘ స్వరూప్ దీనిపై సమావేశం నిర్వహించారు. పెంపుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29 లోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలపాలని కోరారు. పెరిగిన ధరలు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు వర్తిస్తాయన్నారు.

News January 25, 2026

రాజమండ్రి: రేపు PGRS కార్యక్రమం రద్దు

image

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. రిపబ్లిక్ డే కారణంగా రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

News January 25, 2026

తూ.గో: 12.5 టన్నుల గంజాయి దహనం

image

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో గత నాలుగేళ్లుగా సీజ్ చేసిన 12,570 కేజీల గంజాయిని శనివారం నిర్వీర్యం చేశారు. కాపుల ఉప్పాడలోని జిందాల్ ప్లాంట్‌లో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎస్పీ నరసింహ కిషోర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. చట్టప్రకారం ప్రణాళికాబద్ధంగా, పర్యావరణానికి హాని కలగకుండా గంజాయిని దహనం చేశామని, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 25, 2026

తూ.గో: జనవరి 30, 31 తేదీలలో కోకో కాన్క్లేవ్

image

ఏపీ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కోకో కాన్క్లేవ్ – 2026 కార్యక్రమాన్ని జనవరి 30, 31 తేదీలలో ఏలూరులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తూ.గో జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు శనివారం తెలిపారు. ఈ కాన్క్లేవ్‌లో కోకో పంటకు సంబంధించిన నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర నిర్వహణ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారన్నారు. కోకో రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 25, 2026

కొత్త డయాలసిస్ కేంద్రాల జాబితాలో ‘కొవ్వూరు’కు చోటు

image

శనివారం మంత్రి సత్య కుమార్ ప్రకటించిన ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద కొత్తగా మంజూరైన 5 డయాలసిస్ కేంద్రాల జాబితాలో కొవ్వూరుకు చోటు దక్కింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.85 లక్షలతో యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేస్తామని, గ్రామీణ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

News January 25, 2026

విశాఖ ఉత్సవంలో హెలీకాప్టర్ రైడ్

image

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు హెలీకాప్టర్ రైడ్‌ మంచి అనుభూతిని అందింస్తుంది. ఈ హెలీకాప్టర్‌‌ను మంత్రి కందుల దుర్గేష్ శనివారం ప్రారంభించారు. ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, MLA శ్రీనివాసరావు, APTDC ఛైర్మన్ బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు, ఆకాశ మార్గం నుంచి హెలికాప్టర్ రైడ్‌లో వీక్షించారు.

News January 25, 2026

తూ.గో: నేడు ఆనం కేంద్రంలో ఓటరు దినోత్సవ వేడుకలు

image

జాతీయ ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నేడు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమం వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఓటరు అవగాహన కార్యక్రమాలు, కొత్తగా నమోదు అయిన ఓటర్లకు అభినందనలు, ప్రజాస్వామ్య విలువలపై సందేశాలు ఇస్తారని వెల్లడించారు.

News January 24, 2026

తూ.గో: 17 మంది నేరస్తులపై PIT NDPS యాక్ట్

image

తూ.గోలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా గంజాయి అలవాటు పడిన 17 మంది నేరస్తులపై PIT NDPS ACT అమలుకు అనుమతులు రాగా 14 మందిని జైలుకు పంపించామన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఐసోలేషన్ ప్రదేశాలు ఇతర ప్రాంతాలలో డ్రోన్ నిఘా ఏర్పటు చేశామన్నారు.

News January 24, 2026

తూ.గో: జిల్లాలో 201 కేసుల్లో 12,570 కేజీల గంజాయి స్వాధీనం

image

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేయాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 201 కేసులలో 12,570 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మాదకద్రవ్య దుర్వినియోగ హాట్‌స్పాట్‌లు గుర్తించి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సున్నిత ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఎస్పీ సూచించారు.

News January 24, 2026

గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే: ఇన్ఛార్జి కలెక్టర్

image

2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే ఉన్నందున, చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం అమరావతి నుంచి సమీక్ష నిర్వహించారన్నారు. వీటిపై ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.