EastGodavari

News January 23, 2026

డోర్ డెలివరీలలో “తూ.గో” ఆర్టీసీకి ద్వితీయ స్థానం

image

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీ మాసోత్సవాలలో తూ.గో జిల్లా విశేష ప్రతిభ కనబరిచినట్లు DPTO వై.ఎస్.ఎన్ మూర్తి తెలిపారు. జిల్లాలో 4,822 డోర్ డెలివరీలు చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని అధిగమిస్తూ 9,260 డోర్ డెలివరీలు చేసి రాష్ట్రంలోనే తూ.గో జిల్లా ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. తక్కువ ధరతో వేగవంతంగా..సురక్షితంగా వినియోగదారుల ఇంటి వద్దకే పార్సిల్స్ అందజేసినట్లు చెప్పారు.

News January 22, 2026

కాకినాడ: ‘కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు వర్తింపు’

image

మోటారు వాహనాల పన్ను చట్టం సవరణకు ప్రభుత్వం ‘ఆర్డినెన్స్-2026’ జారీ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈనెల 13 నుంచే ఇది అమలులోకి వచ్చిందని, రహదారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వాహనదారులు కొత్త నిబంధనలను గమనించాలన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు, భద్రతా ప్రమాణాల్లో మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

News January 22, 2026

రాజమండ్రి: మార్చి 14న జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ లోక్ అదాలత్‌లో గరిష్ట స్థాయిలో కేసులు పరిష్కరించి, బాధితులకు పరిహారం అందించడమే లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత తెలిపారు. గురువారం ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై మార్చి 14న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై చర్చించారు. రాజీ పడదగ్గ కేసులను త్వరగా పరిష్కరించాలని న్యాయవాదులకు సూచించారు.

News January 22, 2026

తూ.గో: ఆర్టీసీకి ‘సంక్రాంతి’ లాభాలు.. రూ.63 లక్షల ఆదాయం

image

సంక్రాంతి నేపథ్యంలో తూ.గో జిల్లా ఆర్టీసీకి రూ.63 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్లు డీపీటీఓ YSN మూర్తి గురువారం ప్రకటించారు. జిల్లాలోని 4 డిపోల నుంచి 262 బస్సులు నడిపి 36,821మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు చెప్పారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యం అందించి 70% ఆక్యుపెన్సీ రేషియోతో విజయవంతంగా ఆర్టీసీ బస్సులను నడిపినట్లు వివరించారు. సహకరించిన ఆర్టీసీ సిబ్బందికి డీపీటీఓ కృతజ్ఞతలు తెలిపారు.

News January 22, 2026

తూ.గో: అచ్చన్నపాలెంలో రోడ్డు ప్రమాదం

image

నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు వెంకట సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. విధులు ముగించుకుని స్కూటీపై వెళ్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆయన్ను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 22, 2026

బీజేపీ ఎస్సీ మోర్చా ‘గోదావరి జోన్ ఇన్‌ఛార్జ్‌’గా సుమన్ బాబు

image

రాష్ట్ర ఎస్సీ మోర్చా గోదావరి జోన్-2 ఇన్‌ఛార్జ్‌గా దేవరపల్లికి చెందిన దున్న సుమన్ బాబు నియమితులయ్యారు. ఈమేరకు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ నియమాక ఉత్తర్వులు జారీచేసారు. సుమన్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, తూ.గో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పణతల సురేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

News January 21, 2026

హైదరాబాద్‌లో అద్దెకు కారు తీసుకుని అనపర్తిలో అమ్మేశారు

image

అవసరం కోసం హైదరాబాదులో కారును అద్దెకు తీసుకుని అనపర్తిలో అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఈశ్వర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. హైదరాబాద్‌లో డిసెంబర్ 3న హరీష్ అనే వ్యక్తి కారును అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పారిపోయాడు. జీపీఎస్ ద్వారా కారు తోకాడలో ఉందని తెలిసి వచ్చి అడగగా దౌర్జన్యం చేసి కొట్టారు. అనంతరం కారును అనపర్తిలో అమ్మారు.

News January 21, 2026

ధవళేశ్వరంలో ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

image

ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ స్లాబ్ నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదం సంభవించింది. స్లాబ్ వేస్తుండగా బుధవారం సెంట్రింగ్ కూలిపోయింది. దీంతో నిర్మాణపనులు చేస్తున్న కూలీల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 20, 2026

22న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై, 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీలు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 20, 2026

తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

image

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.