EastGodavari

News January 29, 2026

తూ.గో: బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆదేశం

image

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. అనంతరం బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News January 28, 2026

కుష్టు రహిత జిల్లాగా మారుద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

తూ.గో.లో 30వ నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ లెప్రసీ అవగాహన పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ తెలిపారు. బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని ఆదరించాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే చికిత్స పొందాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.

News January 28, 2026

ధవళేశ్వరం: 29న ఉద్యోగ మేళా

image

ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి బుధవారం తెలిపారు. ఎనర్జీ, అగ్రో ఇండస్ట్రీ, రైల్వే సపోర్ట్ సర్వీసులు వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కళాశాల నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://freeshort.info/3HWHGi ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News January 28, 2026

తూ.గో: ఏపీ టూరిజం శాఖ రీజినల్ డైరెక్టర్‌గా మూర్తి

image

తూ.గో డీఆర్‌డీఏ పీడీ ఎన్‌.వి.వి.ఎస్‌. మూర్తిని పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. డిప్యూటేషన్ ప్రాతిపదికన ఏడాది కాలం పాటు ఆయన రాజమహేంద్రవరం రీజియన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘాస్వరూప్ ఆయనను పీడీ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. మూర్తి ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ సేవలందించనున్నారు.

News January 28, 2026

జనవరి 31నే పెన్షన్ల పంపిణీ: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో జనవరి 31నే సామాజిక భద్రత పింఛన్ అందజేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ పేర్కొన్నారు. ఒకరోజు ముందుగానే 31న పంపిణీ చేస్తూ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక భద్రత పథకాలలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. పెన్షన్ దారులు గమనించాలని కోరారు.

News January 28, 2026

రాజమండ్రి: ‘బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి’

image

రాష్ట్రంలోని బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నేతలు బుధవారం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్‌కు వినతిపత్రం అందజేశారు. రాజమండ్రిలో ఆయనను కలిసిన నేతలు.. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ హామీ ఇచ్చారు.

News January 28, 2026

రాజమండ్రి: ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్‌గా మూర్తి నియామకం

image

ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్‌గా(రాజమండ్రి) ఎన్.వి.వి.ఎస్. మూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా ఉన్న మూర్తిని ఆ బాధ్యతల నుంచి బుధవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ రిలీవ్ చేశారు. ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. త్వరలోనే మూర్తి కొత్త పదవిలో బాధ్యతలు స్వీకరిస్తారని అధికారులు వెల్లడించారు.

News January 27, 2026

ఏపీపీఎస్సీ పరీక్షలకు కట్టుదిట్టమైన నిఘా: SP

image

రాష్ట్రవ్యాప్త APPSC పరీక్షల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు SP డి.నరసింహా కిషోర్ మంగళవారం తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అక్రమాలకు తావులేకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 27, 2026

చాగల్లు విద్యార్థినుల TALENT

image

చాగల్లు మండలం ఊనగట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు పంతకాని లాస్య, కంచర్ల హనీ జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో వీరు ప్రతిభ చాటినట్లు హెచ్ఎం రమణ మంగళవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని దిగాలో ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో రాణించేందుకు వెళ్తున్న విద్యార్థినులను గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.

News January 27, 2026

తూ.గో: APPSC పరీక్షలపై డ్రోన్ నిఘా

image

తూ.గో. జిల్లావ్యాప్తంగా APPSC పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. అక్రమాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలు విధుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు.