India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.

వివిధ మ్యాట్రిమోనీ వేదికల ద్వారా మహిళలను మోసం చేస్తున్న ఘరానా దొంగను రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పుష్కర, కోటిలింగాల ఘాట్ల వద్ద మభ్యపెట్టి బంగారం అపహరించిన కేసుల్లో నిందితుడి నుంచి రూ.75 లక్షల విలువైన నగలు, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి పేరుతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

చిన్నకొండేపూడి నుంచి పెద్దకొండేపూడి మధ్య పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించడంతో అటవీశాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో పాదముద్రలు సేకరించి పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. పశువులను మేతకు వదలకూడదని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

రహదారి భద్రత నియమాలను క్రమశిక్షణతో పాటించడం సామాజిక బాధ్యత అని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, రహదారి నిర్వహణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణాల్లో నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు.

అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం అందించాలనే లక్ష్యంతో PM-SYM – PM-LVM ద్వారా జాతీయ పెన్షన్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా సహాయ కార్మిక కమీషనర్ B.S.M వలి శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులు 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3 పెన్షన్ పొందవచ్చన్నారు. ఆసక్తి గలవారు కార్మిక శాఖ కార్యాలయం, మీ-సేవా కేంద్రంలో సంప్రదించాలన్నారు.

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ రెండోరోజు కొనసాగుతోంది. గురువారం రాత్రి డీఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కతేలని రూ.1,82,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ లక్ష్మిపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో, గత రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఆక్వా ఉత్పత్తులు, నర్సరీ మొక్కలు, ఇతర నిత్యావసరాల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్గో టెర్మినల్ ఏర్పాటుపై ఎంపీ పురంధేశ్వరి శుక్రవారం పార్లమెంట్‌లో గళమెత్తారు. దీనిపై పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్పందిస్తూ.. కార్గో సదుపాయాల కల్పన మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుందని వెల్లడించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.

ఫిబ్రవరి 1న ఆదివారం సెలవు కావడంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక రోజు ముందుగానే జనవరి 31న పంపిణీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని 2.71 లక్షల మంది లబ్ధిదారులకు రూ.118.64 కోట్లను నేరుగా ఇంటి వద్దే అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పంపిణీ ప్రక్రియ కోసం 4,600 మంది అధికారులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.