India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశమని సూరజ్ గనోరే అన్నారు. ITDA POగా పని చేసి పదోన్నతిపై పల్నాడు జేసీగా వెళ్తున్న ఆయనను రంపచోడవరంలో అధికారులు, సిబ్బంది గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా సూరజ్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తనవంతు కృషి చేశానని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అన్నారు. పీవో కట్టా సింహాచలం, తదితరులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కాకినాడ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. 48 గంజాయి లిక్విడ్ సీసాలు, ఆరున్నర కిలోల ఎండు గంజాయి, 4500 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు DSP హనుమంతరావు తెలిపారు. కాకినాడకు చెందిన ఇస్మాయేల్, మౌలాలి, అల్లూరి జిల్లాకు చెందిన కొండబాబును అరెస్ట్ చేశామన్నారు. వీరు కాకినాడలో విక్రయించేందుకు గంజాయి తీసుకొచ్చినట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్లు వారు తెలిపారు.
కోనసీమ జిల్లా అమలాపురం మార్కెట్ ఏరియాకు చెందిన నానిపై బుధవారం దాడికి పాల్పడిన సమనస గ్రామానికి చెందిన ముగ్గురిపై టౌన్ పోలీసులు SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నాని ప్రేమిస్తున్న యువతి బంధువులు ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు ధర్మారావు, శ్రీరామ్, కేశవ్‌పై కేసు నమోదు చేశారు. నానిపై దాడిని నేషనల్ ట్రిబ్యునల్ ఫెడరేషన్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఖండించారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రకటించారు. గురువారం పెన్షన్ల పంపిణీలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబుతో కలిసి పిఠాపురం చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీకి ఒక నియోజకవర్గాన్ని ప్రొటోకాల్ పరంగా సొంత నియోజకవర్గంగా ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండడంతో తాను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. మహిళలపై దాడులు అరికట్టడానికి పోలీసు శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. వాళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితులు 9490760794కు సమాచారం ఇవ్వాలని కోరారు.
కాజులూరు మండలం శీల గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై 2017లో ఆమె ఇంటి పక్కనే నివసించే సునీల్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ పెద్దల సమక్షంలో వివాహం అనంతరం తన తండ్రితో కలిసి వేధింపులకు గురి చేశాడు. ఫోక్సో కేసు నమోదు అవ్వడంతో సునీల్‌కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, అతని తండ్రి ఏసుబాబుకు ఏడాది జైలు, రూ.5 జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాలలో అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీలోపు జిల్లా కోఆర్డినేటర్, కలెక్టరేట్ కాంపౌండ్, వికాస ఆఫీసుల్లో దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు.
గోకవరం మండలంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పర్యటించనున్నారు. తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శంకుస్థాపన పనులను బుధవారం మండల డిప్యూటీ తహశీల్దార్ రజిని, ఎంపీడీవో గోవింద్, గోకవరం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పరిశీలించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను MLC ఉదయ భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తాడేపల్లిలో బుధవారం కలిశారు. చింతూరు డివిజన్‌లో వరద బాధితులను గురించి జగన్ ఆరా తీసినట్లు ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. ఆపద సమయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు అండగా ఉండాలని సూచించారని చెప్పారు.
అనపర్తి మండలంలో గురువారం (రేపు) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు రామవరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని తెలిపారు. అనంతరం బలబద్రపురంలో మాజీ MLA నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్కడి నుంచి పందలపాక గ్రామానికి వెళ్లి అక్కడ వైద్యశిబిరం ప్రారంభిస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.